కాంగ్రెస్ లో చేరిన ఎమ్మెల్యేలను ఉద్దేశించి బీఆర్‌ఎస్ పార్టీ ఎమ్మెల్యే కౌశిక్ రెడ్డి కీలక వ్యాఖ్యలు చేశారు. కాంగ్రెస్ లో చేరిన ఎమ్మెల్యేలు చీరలు, గాజులు వేసుకోవాలంటూ హాట్ కామెంట్స్ చేశారు బీఆర్‌ఎస్ పార్టీ ఎమ్మెల్యే కౌశిక్ రెడ్డి. అసెంబ్లీ సెక్రటరీని బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు పాడి కౌశిక్ రెడ్డి, కేపీ వివేకానంద్ ఎమ్మెల్యేలు కలిశారు.
ఫిరాయింపులపై హైకోర్టు ఇచ్చిన ఆదేశాల ప్రక్రియను వెంటనే ప్రారంభించాలని అసెంబ్లీ సెక్రటరీని కలిసి కోరారు. ఈ సందర్భంగా కాంగ్రెస్ లో చేరిన ఎమ్మెల్యేలను ఉద్దేశించి బీఆర్‌ఎస్ పార్టీ ఎమ్మెల్యే కౌశిక్ రెడ్డి కీలక వ్యాఖ్యలు చేశారు. పార్టీ మారిన బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు చీరలు, గాజులు వేసుకోవాలని సూచనలు చేశారు. చీరలు గాజులు పంపుతున్నా అంటూ చూపించారు కౌశిక్ రెడ్డి. రెండు రోజుల్లో పది మంది ఎమ్మెల్యేలకు చీరలు గాజులు కొరియర్ చేస్తానని కౌశిక్ రెడ్డి ఫైర్ అయ్యారు.