మళ్లీ TRSగా BRS పార్టీ మారనుందా…అంటే అవుననే అంటున్నారు. బీఆర్‌ఎస్ పార్టీలోని కీలక నేతలు దీనిపై కేసీఆర్ దగ్గర ఒత్తిడి తెస్తున్నారట. BRS పార్టీ పేరు మార్చి.. టీఆర్‌ఎస్ గా మార్చాలని డిమాండ్ చేస్తున్నారు. ఇక నిన్న ఇదే విషయాన్ని మాజీ మంత్రి,ఎమ్మెల్యే కడియం శ్రీహరి ప్రస్తావించారు. కేటీఆర్ సమక్షంలోనే…BRS పార్టీ పేరు మార్చి.. టీఆర్‌ఎస్ గా మార్చాలని కోరారు మాజీ మంత్రి,ఎమ్మెల్యే కడియం శ్రీహరి.
కాంగ్రెస్ పార్టీ ముందు హామీల అమలు పై శ్వేత పత్రాలు ప్రకటించండని…ఉమ్మడి జిల్లాల కాంగ్రెస్ రివ్యూ మీటింగ్ ను సీఎం రేవంత్ mcr hrd లో పెట్టారని తెలిపారు. రాజకీయ సమావేశాలు ఆ సంస్థలో పెట్టవచ్చునా ? అంటూ ప్రశ్నించారు. ప్రగతి భవన్ లో కండువాలు కప్పితే ఆనాడు కేసీఆర్ ను తప్పు పట్టారని ఆగ్రహించారు. అసెంబ్లీ నియోజక వర్గాలకు 10 కోట్ల రూపాయల ఖర్చు భాద్యతను ఇంచార్జ్ మంత్రుల చేతి లో పెట్టడం సరికాదని…కేవలం కాంగ్రెస్ ఎమ్మెల్యేల కే ప్రభుత్వ నిధులు ఇవ్వాలనే కుట్ర చేస్తున్నారని ఫైర్ అయ్యారు. ఫార్ములా వన్ నిధులు దుర్వినియోగమైతే విచారణ చేసుకోవచ్చు…. ఫార్ములా వన్ ను రద్దు చేయడం సరికాదని మండిపడ్డారు.