ఉగాది వేడుకల్లో పాల్గొన్నారు బీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్. శ్రీ క్రోధి నామ సంవత్సర తెలుగు సంవత్సరాది ఉగాది పర్వదినం సందర్భంగా తెలంగాణ భవన్లో ఏర్పాటు చేసిన ఉగాది వేడుకల్లో పాల్గొన్నారు బీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్. దీనికి సంబంధించిన ఫోటోలు వైరల్ గా మారాయి.

అటు తెలుగు రాష్ట్రాల ప్రజలకు ఉగాది శుభాకాంక్షలు తెలిపారు బీఆర్ఎస్ అధినేత కేసీఆర్. ఉగాది నుండి కాలచక్రం తిరిగి మొదలౌతుందని, చెట్లు చిగురిస్తూ ప్రకృతిలో నూతనోత్తేజం నెలకొంటుందని.. వ్యవసాయ పనులను రైతన్నలు ఉగాది నుండే ప్రారంభిస్తారు. అందువల్ల ఉగాదిని వ్యవసాయ నామ సంవత్సరంగా పిలుచుకోవడం ప్రత్యేకత అని చెప్పారు.