Hetero: ఖమ్మం భాదితులకు బీఆర్ఎస్ ఎంపీ భారీ విరాళం ప్రకటించారు. ఖమ్మం వరద బాధితులకు రూ.1 కోటి విరాళం ఇచ్చారు బీఆర్ఎస్ రాజ్యసభ ఎంపీ బండి పార్థసారథి రెడ్డి. కోటి రూపాయల చెక్కును కలెక్టర్‌కు అందజేశారు హెటిరో డ్రగ్స్ అధినేత ఎంపీ బండి పార్థసారథి రెడ్డి.

అంతేకాదు… కోటి రూపాయలతో పాటు లక్షలాది విలువచేసే మందులు వితరణ చేసేందుకు నిర్ణయం తీసుకున్నారు బీఆర్ఎస్ రాజ్యసభ ఎంపీ బండి పార్థసారథి రెడ్డి. వారం రోజులు పాటు ఖమ్మంలోనే సేవలు అందించనున్నారు సింధు హాస్పిటల్ డాక్టర్లు. ఈ మేరకు ప్రకటన బీఆర్ఎస్ రాజ్యసభ ఎంపీ బండి పార్థసారథి రెడ్డి. ఇక అటు ఇప్పటికే ఖమ్మం వరద బాధితులకు టీఆర్‌ఎస్ పార్టీ నేతలు.. తమ నెల జీతం ప్రకటించిన సంగతి తెలిసిందే.