తెలంగాణలో గ్రూప్-4 నియామకాలపై హైకోర్టు మధ్యంతర తీర్పు..!

-

తెలంగాణ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన గ్రూప్-4 నియామకాలపై హైకోర్టు కీలక వ్యాఖ్యలు చేసింది. తుది తీర్పునకు లోబడే నియామకాలు చేపట్టాలని ప్రభుత్వానికి తేల్చి చెప్పింది. అయితే,గతంలో విడుదల చేసిన గ్రూప్-4 నోటిఫికేషన్లో ట్రాన్స్ జెండర్లకు రిజర్వేషన్లు కల్పించలేదు. ఈ నోటిఫికేషన్ 2022లో అప్పటి బీఆర్ఎస్ ప్రభుత్వం విడుదల చేసింది.ట్రాన్స్ జెండర్లకు రిజర్వేషన్లు కల్పించలేదని సూర్యాపేటకు చెందిన దేవత్ శ్రీను సహా మరో ముగ్గురు హైకోర్టు ఆశ్రయించారు.

ఇందులో పిటిషనర్ తరఫు లాయర్..జాతీయ న్యాయసేవాధికర సంస్థ వర్సెస్ కేంద్రం కేసులో ట్రాన్స్ జెండర్లకు ప్రత్యేక రిజర్వేషన్లు కల్పించాలని 2014లో సుప్రీంకోర్టు ఇఛ్చిన తీర్పును ప్రస్తావించారు.దీంతో ఈ పిటిషన్‌పై విచారణ చేపట్టిన కోర్టు తుది తీర్పునకు లోబడి నియామకాలు చేపట్టాలని ప్రభుత్వాన్ని కోరగా.. కౌంటర్ దాఖలుకు 10 రోజుల టైం కావాలని ప్రభుత్వం తరఫు లాయర్ కోరారు.ఇరువురి వాదనలు విన్న జస్టిస్ అలోక్ అరాదే, జస్టిస్ శ్రీనివాసరావులతో కూడిన ధర్మాసనం ప్రభుత్వ న్యాయవాదికి సమయం ఇస్తూ కేసును 10 రోజులకు వాయిదా వేసింది.

 

Read more RELATED
Recommended to you

Latest news