పనుల మీద కంటే ప్రచారం మీద ఫోకస్ చేసి ఉంటే BRS గెలిచేది – కేటీఆర్‌

-

మహబూబాద్ పార్లమెంట్ నియోజకర్గ సన్నాహక సమావేశంలో బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ కీలక వ్యాఖ్యలు చేశారు. కాంగ్రెస్ పార్టీ అబద్ధాల ముందు అభివృద్ధి ఓడిపోయిందని..పనుల మీద కంటే ప్రచారం మీద ఫోకస్ చేసి ఉంటే BRS గెలిచేదని అభిప్రాయపడ్డారు.వందలాది సంక్షేమ కార్యక్రమాలు మన ప్రభుత్వ హయాంలో అమలు చేసినా, ఏనాడు కూడా ప్రజలను లైన్లలో నిలబెట్టలేదన్నారు. ప్రజల సౌకర్యమే చూసాము కానీ రాజకీయ ప్రయోజనము, రాజకీయ ప్రచారమే గురించి ఏనాడు ఆలోచించలేదు….ప్రజలు BRS ను పూర్తిగా తిరస్కరించలేదని పేర్కొన్నారు.

BRS Working President KTR at Preparatory Meeting of Mahbubad Parliament Constituency

BRS పార్టీకి మూడో వంతు సీట్లు 39 వచ్చాయి. 14 స్థానాల్లో ఓటమి కేవలం గరిష్టంగా 6 వేల ఓట్ల తోనే జరిగింది. మొత్తంగా కాంగ్రెస్ మనకు తేడా కేవలం 1.85 శాతం అని చెప్పారు. పార్టీ సమావేశాలను వరుసగా పెట్టుకుంటాం… అనుబంధ సంఘాలను బలోపేతం చేస్తాం.. పార్టీకి అన్ని వర్గాలను దగ్గరయ్యేలా కార్యక్రమాలు చేపడతామని తెలిపారు.గిరిజనులకు స్థానిక సంస్థల రిజర్వేషన్ తో పాటు.. పొడు భూముల పట్టాల పంపిణీ, అనేక ఇతర సంక్షేమ పథకాలు అనేక కార్యక్రమాలను మన ప్రభుత్వం గతంలో అందించిందని..అయినా గిరిజనం ఎక్కువ ఉన్న చోట్లకూడా ప్రజలు పూర్తి మద్దతు మనకివ్వలేదు, ఇలాంటి వాటన్నింటి సమీక్ష చేసుకుని ముందుకుపోతామని స్పష్టం చేశారు బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్.

Read more RELATED
Recommended to you

Latest news