సంక్రాంతి తర్వాత తెలంగాణలో బస్సు యాత్ర – వైఎస్ షర్మిల

-

వైయస్సార్ తెలంగాణ పార్టీ అధ్యక్షురాలు వైయస్ షర్మిల అడిషనల్ డీజీపీని కలిశారు. ఇటీవల తనను అన్యాయంగా అరెస్టు చేయడంపై డిజిపి కి ఫిర్యాదు చేశారు షర్మిల. తాను ట్రాఫిక్ నిబంధనలు ఉల్లంఘించకున్నా అక్రమంగా కేసులు పెట్టారని ఆయన దృష్టికి తీసుకువెళ్లారు. ఇక ఈ నెల 4వ తేదీ నుండి చేపట్టే పాదయాత్రకు భద్రత కల్పించాలని షర్మిల కోరారు.

అనంతరం ఆమె మాట్లాడుతూ.. నర్సంపేటలో టిఆర్ఎస్ గూండాలు దాడి చేశారని.. దాడి చేసిన వాళ్ళని వదిలిపెట్టనన్నారు. సీఎం ని కలవడానికి వెళితే ట్రాఫిక్ వాయులేషన్స్ పేరుతో అరెస్టు చేశారని తెలిపారు. ప్రజాస్వామ్యాన్ని ఖూనీ చేసే విధంగా పోలీసులను వాడుకుంటున్నారని మండిపడ్డారు షర్మిల. పోలీసుల తీరుపై కూడా ఫిర్యాదు చేశానన్నారు. తెలంగాణలో తాలిబన్ల రాజ్యం సాగుతుందని మండిపడ్డారు.

తెలంగాణ రాష్ట్రాన్ని అప్పులకుప్పగా మార్చి.. కెసిఆర్ కుటుంబం ఆస్తులను పెంచుకుంటుందని ఆరోపించారు. ఇక తాను బిజెపికి దత్తపుత్రికను కానే కాదన్నారు షర్మిల. ఇన్నాళ్లు బిజెపితో కలిసి తిరిగిన కేసిఆర్ ని బిజెపికి పెళ్ళాం అనాలా? అంటూ ఘాటు వ్యాఖ్యలు చేశారు. ఇక సంక్రాంతి తర్వాత తెలంగాణలో బస్సు యాత్రను ప్రారంభిస్తున్నట్లు తెలిపారు.

Read more RELATED
Recommended to you

Latest news