ప్రపంచంలో ది బెస్ట్ సినిమాలలో ఒకటిగా ఆర్ఆర్ఆర్..!!

-

ఇప్పుడు దేశంలో నంబర్ వన్ దర్శకుడిగా మన రాజమౌళి ఎదిగిన సంగతి అందరికి తెలిసిందే. బహుబలి సినిమా లతో భారతీయ చలన చిత్ర పరిశ్రమలో తనదైన ముద్ర వేశారుమళ్లీ ఆర్ఆర్ఆర్ సినిమాతో రికార్డ్స్ బ్రేక్ చేశారు రాజమౌళి. ఇప్పుడు తన తర్వాత సినిమా పై మనకంటే దేశంలో ఎక్కువుగా ఆసక్తి వుంది. అలాగే రీసెంట్ గా జపాన్ లో ఆర్ఆర్ఆర్ విడుదల కోసం రాజమౌళి, రామ్ చరణ్, జూ ఎన్టీఆర్ అక్కడకు వెళ్ళిన విషయం తెలిసిందే.

అక్కడి ప్యాన్స్ తో వున్న ఫోటోస్, వీడియోస్ సోషల్ మీడియాలో హల్చల్ చేశాయి. అక్కడి ఫోటోస్ మీడియాలో వైరల్ గా మారాయి.తాజాగా ఆర్ఆర్ఆర్ సినిమా సన్ సెట్ సర్కిల్ అవార్డును సొంతం చేసుకుంది. ఉత్తమ ఇంటర్నేషనల్ ఫీచర్డ్ ఫిల్మ్ కేటగిరీలో ఆర్ ఆర్ ఆర్ సినిమాకు గాను సన్ సెట్ సర్కిల్ అవార్డు దక్కింది.ఆస్కార్ రేంజ్ కాకున్నా కూడా అంతర్జాతీయ స్థాయి అవార్డు అందుకుంది.

ఇక లేటెస్ట్ గా అయితే మరో ఖ్యాతిని ఈ చిత్రం సాధించింది. ఈ సంత్సరమంతా ప్రపంచ స్తాయిలో విడుదల అయిన సినిమాలలో ఐ ఎం డి బి వారు ప్రజల్ని ఆకట్టుకున్న మొదటి  50 సినిమాలలో  ఆర్ఆర్ఆర్ కూడా ఎంపిక అయ్యింది. నిజానికీ ప్రపంచ వ్యాప్తంగా అనేక భాషల్లో వేల సంఖ్యలో సినిమాలు రిలీజ్ అవుతూ ఉంటాయి. వాటిల్లో మొదటి యాభై సినిమాలలో ఒకటి గా నిలవటం అంటే మాటలు కాదు. ఇండియా మొత్తంలో కూడా ఓకే ఒక్క సినిమా ఆర్ ఆర్ ఆర్ .దీనితో అయితే చిత్ర యూనిట్ ఆనందం వ్యక్తం చేస్తున్నారు.

 

Read more RELATED
Recommended to you

Latest news