హైదరాబాద్ మహానగరంలో మరో దారుణం జరిగింది. 14 రోజుల పసికందును కసాయి తల్లి చంపేసింది. ఈ సంఘటన ఇవాళ ఉదయం తెరపైకి వచ్చింది. ఈ సంఘటన వివరాలు ఇలా ఉన్నాయి. మైలార్ దేవ్ పల్లిలో… ఓ తల్లి షాకింగ్ నిర్ణయం తీసుకుంది. 14 రోజుల పసికందును చంపి… కిరాతకంగా ప్రవర్తించింది కసాయి తల్లి.

పసికందులు బకెట్ నీళ్లలో వేసి చంపి ప్రమాదవశాత్తు చనిపోయినట్లు చిత్రీకరించే ప్రయత్నం చేసింది. స్నానం చేసి వచ్చేలోపు బకెట్లో పడి చనిపోయిందని తల్లి నాటకాలు కూడా ఆడింది. ఆర్థిక ఇబ్బందులతో తల్లి పసికందును చంపినట్లు పోలీసులు ఈ కేసును చేదించారు. తల్లి పై కేసు నమోదు కూడా చేశారు. ఈ సంఘటనపై ఇంకా వివరాలు తెలియాల్సి ఉంది.
- హైదరాబాద్:
- మైలార్దేవ్పల్లిలో దారుణం..
- 14 రోజుల పసికందుని చంపిన కసాయి తల్లి..
- పసికందును బకెట్ నీళ్లలో వేసి చంపి ప్రమాదవశాత్తుగా చిత్రీకరణ..
- స్నానం చేసి వచ్చేలోపే బకెట్లో పడి చనిపోయిందని తల్లి నాటకం..
- ఆర్థిక ఇబ్బందులతో తల్లే పసికందును చంపినట్లు నిర్థారించిన పోలీసులు..