విద్యా వ్యవస్థ పై క్యాబినెట్ సబ్ కమిటీ భేటీ..!

-

తెలంగాణలో విద్యావ్యవస్థ పై తాజాగా క్యాబినెట్ సబ్ కమిటీ భేటీ అయింది. రాష్ట్ర మంత్రులు శ్రీధర్ బాబు, సీతక్కల ఆధ్వర్యంలో క్యాబినెట్ సబ్ కమిటీ భేటీ జరిగింది.  ముఖ్యంగా రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి కోచింగ్ సెంటర్లు పాటించాల్సిన మార్గదర్శకాలపై క్యాబినెట్ సబ్ కమిటీ ఓ కీలక నిర్ణయం తీసుకుంది. ఈ భేటీలో తెలంగాణ విద్యావ్యవస్థలో తీసుకురావాల్సిన ముఖ్యమైనటువంటి సంస్కరణల గురించి చర్చించారు.

ఢిల్లీలో జరిగిన కోచింగ్ సెంటర్ విషాదం నేపథ్యంలో కోచింగ్ సెంటర్లు పాటించాల్సిన కొన్ని నియమాలను కేంద్ర ప్రభుత్వం నిర్దేశించింది. అన్ని రాష్ట్రాలు కేంద్ర ప్రభుత్వం నిర్దేశించిన మార్గదర్శకాలను అమలు చేయాలని  ఉత్తర్వులు జారీ చేసింది. తాము జారీ చేసినటువంటి ఆదేశాలను తెలంగాణ ప్రభుత్వం అమలు చేయడం లేదని కేంద్ర ప్రభుత్వం ఆగ్రహం వ్యక్తం చేసింది. రాష్ట్రంలోని అన్ని కోచింగ్ సెంటర్లలో కేంద్రం సూచించిన మార్గదర్శకాలు కచ్చితంగా అమలు చేసేవిధంగా చూడాలని క్యాబినెట్ సబ్ కమిటీ అధికారులను ఆదేశించింది.

Read more RELATED
Recommended to you

Latest news