జార్ఖండ్ లో బీజేపీ కీలక నిర్ణయం.. అభ్యర్థులను డిసైడ్ చేయనున్న కార్యకర్తలు..!

-

దేశంలో హర్యానా, జమ్మూకాశ్మీర్,  జార్ఖండ్ రాష్ట్రాల్లో అసెంబ్లీ ఎన్నికలు జరుగనున్న విషయం తెలిసిందే. ఇప్పటికే జమ్మూకాశ్మీర్, హర్యానా వంటి రాష్ట్రాల్లో తిరుగుబాటును ఎదుర్కొంటున్నారు బీజేపీ అభ్యర్థులు. ఈ నేపథ్యంలో జార్ఖండ్ లో బీజేపీ కీలక నిర్ణయం తీసుకుంది. ఈ నిర్ణయంతో  అభ్యర్థులను డిసైడ్ చేయనున్నారు కార్యకర్తలు. ముఖ్యంగా జార్ఖండ్ లోని అన్ని అసెంబ్లీ నియోజకవర్గాలలో కార్యకర్తల మధ్య ఓటింగ్ నిర్వహించాలని నిర్ణయించారు.

ఒక్కో అసెంబ్లీ స్థానానికి ముగ్గురు అభ్యర్థులతో కూడిన ప్యానెల్ ను సిద్దం చేస్తారు. వారిని ఢిల్లీకి పంపి అక్కడ తుది నిర్ణయం తీసుకుంటారు. అభ్యర్థుల ఎంపికకు సంబంధించి తాజాగా అభిప్రాయ సేకరణ ప్రారంభించినట్టు సమాచారం. మొత్తం 81 అసెంబ్లీ స్థానాల్లో ఇద్దరూ పరిశీలకులకు బాధ్యతలు అప్పగించారు. పరిశీలకులు వారి అసెంబ్లీకి వెళ్లి కార్యకర్తల అభిప్రాయాలను సేకరిస్తారు. దీనికి సంబంధించిన నివేదిక రాష్ట్ర కార్యాలయానికి అందజేయనున్నారు. అసెంబ్లీల వారిగా అభిప్రాయాల సేకరణకు రాష్ట్ర సంస్థ సీనియర్ సభ్యులను ఇన్ చార్జీలుగా నియమించారు. ఈ ప్రక్రియను శాంతియుతంగా పూర్తి చేయాలని ఢిల్లీలో బీ.ఎల్. సంతోష్ జార్ఖండ్ నేతలతో సమావేశమయ్యారు.

Read more RELATED
Recommended to you

Latest news