హైదరాబాద్ లో కేటీఆర్ తెగ డ్రామాలు ఆడుతున్నాడు.నగరాన్ని తానే తీర్చిదిద్దినట్లు గా తెగ హడావిడి చేస్తున్నడు అని కంటోన్మెంట్ ఎమ్మెల్యే శ్రీ గణేష్ అన్నారు. వినే వాళ్లు అమాయకులైతే హైదరాబాద్ నగరాన్ని కనిపెట్టింది కల్వకుంట్ల కుటుంబం అని చెపుతాడేమో… అయినా కేటీఆర్ ఏ మొహం పెట్టుకొని నగరంలో తిరుగుతున్నాడు…?. పదేళ్ల పాటు హైదరాబాద్ ను గాలికి వదిలేసి ఇప్పుడు తెగ బడాయి కబుర్లు చెపుతున్నావు. చిన్న వర్షం పడితే నగరం వణికిపోయే పరిస్థితి తీసుకువచ్చారు. నాలా లు, చెరువులు కబ్జాకు గురైతే పట్టించుకున్న పాపాన పోలేదు. మీ హయాంలోనే కదా నగరం వరదల్లో మునిగిపోయింది.
నువ్వు మురికి నీళ్లు శుద్ధి చేస్తే మూసీ మురికి కూపం గానే ఎందుకు ఉంది. మూసీ లో ఏమైనా కొబ్బరి నీళ్లు ప్రవహిస్తున్నాయా… మా ప్రభుత్వం మూసీ ని ప్రక్షాళన చేస్తానంటే ఓర్వ లేకపోతున్నావు. మూసీ రివర్ ఫ్రంట్ డెవలప్మెంట్ వల్ల నిర్వాసితులు అవుతున్న వారికి డబుల్ బెడ్రూం ఇల్లు ఇస్తున్నాం. సీఎం రేవంత్ రెడ్డి నాయకత్వంలో మూసీ ప్రక్షాళన చేస్తాం.. నగరాన్ని సుందరంగా తీర్చిదిద్దుతాం. ఇక హైదరాబాద్ లో మీ ఆనవాళ్లను నగర ప్రజలే తూడిపేస్తారు. పార్లమెంటు ఎన్నికల్లో ఇప్పటికే సగం తూడ్చి పారేశారు. కంటోన్మెంట్ ఉప ఎన్నికల్లో మూడో స్థానానికి నెట్టి మీ అవసరం లేదని తేల్చారు. జీహెచ్ఎంసీ ఎన్నికల్లో మిమ్మల్ని మూసీ నదిలో విసిరేస్తారు అని ఎమ్మెల్యే గణేష్ పేర్కొన్నారు.