బంజారాహిల్స్ లో కారు బీభత్సం…మరో కారు, ఆటో తుక్కుతుక్కు !

-

బంజారాహిల్స్ లో కారు బీభత్సం చోటు చేసుకుంది. వేగంగా వచ్చి కమర్షియల్ కాంప్లెక్స్ పార్కింగ్ లో పార్క్ చేసిన కారు, ఆటోను ఢీ కొట్టింది మరో కారు. అనంతరం పల్టీ కొట్టిన కారు…తుక్కు తుక్కు అయింది. ఈ సంఘటనలో కారు డ్రైవర్ కు గాయాలు అయ్యాయి. అయితే.. ఈ సంఘటనలో ఎలాంటి ప్రాణాష్టం లేకపోవడంతో ఊపిరి పీల్చుకున్నారు అధికారులు.

Car accident in Banjara Hills

ఇక ఈ సంఘటనపై ప్రత్యక్ష సాక్షులు మాట్లాడుతూ..బంజరహిల్స్ రోడ్ నెంబర్ 2 లో ఫార్చునర్ కార్ అత్యంత వేగంగా దూసు కొచ్చిందని… లుంబిని కమర్షియల్ కాంప్లెక్స్ ఫుట్ పాత్ పైకెక్కి పార్కింగ్ ప్లేస్ లో ఉన్న ఆటో కారు ఢీకొట్టిందని తెలిపారు. ఫార్చునర్ కార్ 120 ప్లస్ స్పీడ్ లో ఉందని.. కారు స్పీడ్ గా వచ్చి కంట్రోల్ కాక పార్కింగ్ ప్లేస్ లో మెట్ల పైకెక్కి గ్రిల్స్ పై నుండి పార్కింగ్ ప్లేస్ లో ఉన్న ఆటో కారు ఢీ కొట్టి పల్టీలు కొట్టి ఆగిందని వెల్లడించారు. కారు నడిపింది మైనర్ బాలుడు అందులో ఫ్యామిలీ ఉన్నారన్నారు. కారు లో ఉన్న వారికి స్వల్ప గాయాలయ్యాయని చెప్పారు. మైనర్ బాలుని పోలీసులు అదుపులోకి తీసుకున్నారన్నారు.

https://x.com/telanganaawaaz/status/1829729870609326160

Read more RELATED
Recommended to you

Latest news