రైలు ప్రయాణికులకు దక్షిణ మధ్య రైల్వే కీలక సూచన చేసింది. బల్లార్ష, సికింద్రాబాద్, విజయవాడ మార్గంలో ప్రయాణించే ప్యాసింజర్స్‌కు ఇది చేదువార్తగానే చెప్పాలి. వరంగల్ -కాజీపేట నాలుగో లైన్ నిర్మాణ పనుల కారణంగా సెప్టెంబర్- అక్టోబర్ మధ్యలో 94 రైలు సర్వీసులను ఎంపిక చేసిన తేదీల్లో రద్దు చేస్తున్నట్లు సౌత్ సెంట్రల్ రైల్వే ప్రకటించింది. అందులో 41 రైళ్లను దారి మళ్లించడనుండగా.. మరో 27 రైళ్ల ప్రయాణ సమయాలను మార్పులు చేసింది.
రద్దయిన రైలు సర్వీసుల్లో గోల్కొండ, శాతావాహన, ఎక్స్‌ప్రెస్, సికింద్రాబాద్ గుంటూరు ఇంటర్ సిటీ ఎక్స్‌ప్రెస్, సికింద్రాబాద్ -కాగజ్‌నగర్, విజయవాడ-సికింద్రాబాద్, భద్రాచలం రోడ్ బల్లార్ష తదితర రైళ్లు కూడా ఉన్నాయి. మరల ఈ రైళ్లు ఎప్పుడు అందుబాటులోకి వస్తాయనే విషయంపై త్వరలోనే ప్రకటన చేస్తామని దక్షిణ మధ్య రైల్వే పేర్కొంది. రైళ్లు రద్దు కారణంగా ప్రయాణికులు ప్రత్యామ్నాయ మార్గాలను ఎంచుకోవాలని సూచించింది.