బీఆర్ఎస్ మాజీ ఎమ్మెల్యే షకీల్ కు పోలీసులు షాక్ ఇచ్చారు. తన కొడుకు సోహెల్ ను కేసు నుంచి తప్పించేందుకు విదేశాలకు పంపించిన బోధన్ బీఆర్ఎస్ మాజీ ఎమ్మెల్యే షకీల్ పై కేసు నమోదు చేయాలని పోలీసులు నిర్ణయించారు. దీనికి సహకరించిన పంజాగుట్ట మాజీ సీఐ దుర్గారావుపై కూడా కేసు నమోదు చేయనున్నారు. మాజీ ఎమ్మెల్యే షకీల్ కుమారుడు సోహెల్ ఇటీవల తన BMW కారును వేగంతో నడిపి ప్రజా భవన్ ఎదురుగా ఉన్న ట్రాఫిక్ బారికేడ్లను ఢీ కొట్టిన విషయం తెలిసిందే.
ప్రజాభవన్ వద్ద డిసెంబర్ 24న ఆదివారం రాత్రి అతివేగంగా వచ్చిన ఓ బీఎండబ్ల్యూ కారు భారీకేడ్లను ఢీ కొట్టింది. ఆ సమయంలో కారులో ఇద్దరు యువకులతో పాటు ఇద్దరు యువతులు ఉన్నట్లు తెలిసింది. ఆ కారు బోధన్ మాజీ ఎమ్మెల్యే షకీల్ కుమారుడు సోహెల్ దని చెబుతున్నారు పోలీసులు. వీళ్లంతా స్టూడెంట్స్ అని.. కారు డ్రైవ్ చేసింది బోధన్ మాజీ ఎమ్మెల్యే షకీల్ కొడుకు సోహెల్ అని కన్ఫామ్ చేశారు పోలీస్ అధికారులు. ప్రస్తుతం సోహెల్ పరారీలో ఉండగా.. అతడి కోసం గాలిస్తున్నట్లు వెల్లడించారు. మిగతా యువకులను అదుపులోకి తీసుకున్నట్లు తెలిపారు. యాక్సిడెంట్ జరిగిన తర్వాత షకీల్ ఇంట్లో డ్రైవర్గా పని వేసే వ్యక్తి.. తానే డ్రైవ్ చేసినట్లుగా పోలీస్ స్టేషన్కు వచ్చాడని వెల్లడించారు. షకీల్ డ్రైవర్ పోలీసుల్ని తప్పుదోవ పట్టించే యత్నం చేశాడని.. కానీ సీసీ ఫుటేజీ ద్వారా సోహెల్ కారు నడిపినట్లు గుర్తించినట్లు చెప్పారు.