కేటీఆర్, గోరటి వెంకన్న ఇంటర్వ్యూపై కేసు నమోదు

-

తెలంగాణ శాసనసభ ఎన్నికల ప్రచారంలో బీఆర్ఎస్ పార్టీ దూసుకెళ్తోంది. ముఖ్యంగా ఆ పార్టీ అధినేత కేసీఆర్​తో పాటు పార్టీ కార్య నిర్వాహక అధ్యక్షుడు, మంత్రి కేటీఆర్ విస్తృతంగా ఎన్నికల ప్రచారం నిర్వహిస్తున్నారు. ఓవైపు బహిరంగ సభలు.. మరోవైపు ఆత్మీయ సమ్మేళనాలు.. ఇంకోవైపు ఇంటర్వ్యూలతో బిజీబిజీగా గడుపుతున్నారు. సోషల్ మీడియాలోనూ కేటీఆర్ ప్రచారాన్ని హోరెత్తిస్తున్నారు. ఏ అవకాశాన్ని వదులుకోకుండా అన్ని రకాలుగా కేటీఆర్ ప్రచారాన్ని హోరెత్తిస్తున్నారు. ఈ క్రమంలోనే కాస్త వెరైటీగా యూట్యూబర్లతో కలిసి సందడి చేశారు.

మరోవైపు ప్రొఫెసర్ నాగేశ్వరరావు, జయప్రకాశ్ నారాయణ్, గోరటి వెంకన్న వంటి ప్రముఖులు చేసిన ఇంటర్వ్యూలో పాల్గొన్నారు. తొమ్మిదన్నరేళ్లలో తెలంగాణ చేసిన అభివృద్ధి ఏంటి.. కేసీఆర్ సర్కార్ వైఫల్యాలు ఇలా పలు అంశాలపై మాట్లాడారు. అయితే ఇటీవల కేటీఆర్​ను గోరటి వెంకన్న ఇంటర్వ్యూ చేసిన విషయం తెలిసిందే. ఈ ఇంటర్వ్యూపై తాజాగా కేసు నమోదైంది. ఈ ఇంటర్వ్యూ నిర్వాహకుడిపై సైఫాబాద్ పోలీసులు కేసు నమోదు చేశారు. ఆ నిర్వాహకుడు ఎవరనే విషయాలు తెలుసుకునే పనిలో పడ్డారు. అమరవీరుల స్మారక ప్రాంగణంలో ఇంటర్వ్యూ నిర్వహించడంపై కాంగ్రెస్ పార్టీ ఎన్నికల అధికారికి ఫిర్యాదు చేయడంతో.. రిటర్నింగ్ అధికారి సూచన మేరకు పోలీసులు కేసు నమోదు చేశారు.

Read more RELATED
Recommended to you

Latest news