10 రోజుల్లో ఫామ్​హౌస్​కే కేసీఆర్ పరిమితం : కోమటిరెడ్డి వెంకట్​రెడ్డి

-

తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల ప్రచారంలో కాంగ్రెస్ దూసుకెళ్తోంది. పార్టీ అభ్యర్థులు నియోజకవర్గాల్లో పర్యటిస్తూ.. ఆరు గ్యారెంటీలు, అభయహస్తం మేనిఫెస్టోను ప్రజలకు వివరిస్తున్నారు. కేసీఆర్ సర్కార్ వైఫల్యాలను ప్రజల చెంతకు తీసుకెళ్తూ కాంగ్రెస్ అధికారంలోకి వచ్చేందుకు ఒక్క అవకాశం ఇవ్వాలని కోరుతున్నారు. ఈ క్రమంలోనే నల్గొండ జిల్లా ఎన్నికల ప్రచారంలో ఎంపీ కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి పాల్గొన్నారు. ఈ సందర్భంగా కేసీఆర్​పై, రాష్ట్ర ప్రభుత్వంపై తీవ్ర విమర్శలు చేశారు.

‘పది రోజులు ఆగితే కేసీఆర్‌ శాస్వతంగా ఫామ్‌ హౌస్‌కు పోవడం ఖాయం. నిన్న నల్గొండలో పర్యటించిన కేసీఆర్‌ పచ్చి అబద్ధాలు మాట్లాడారు. గజ్వేల్‌ను అభివృద్ధి చేసినట్లు నల్గొండను ఎందుకు అభివృద్ధి చేయలేదు. నల్గొండ తెలంగాణలో లేదా.. నల్గొండను ఎందుకు అభివృద్ధి చేయలేదు. నల్గొండలో శంకుస్థాపనలు చేసి.. అభివృద్ధి అంటున్నారు. నల్గొండ ఇంకా దత్తతలోనే ఉందని ప్రజలను మభ్యపెడుతున్నారు. తెలంగాణ సాధించుకున్న తర్వాత రాష్ట్రంలో కేసీఆర్‌ కుటుంబ సభ‌్యులు మినహా సామాన్య ప్రజలెవరూ బాగుపడలేదు’ అని కాంగ్రెస్ అభ్యర్థి కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి అన్నారు.

Read more RELATED
Recommended to you

Latest news