BREAKING : మంత్రి గంగుల కమలాకర్ కు CBI నోటీసులు

BREAKING : తెలంగాణ పౌర సరఫరాల శాఖ మంత్రి మంత్రి గంగుల కమలాకర్ కు మరో షాక్‌ తగిలింది. ఇప్పటకే మైనింగ్‌ వ్యవహారంలో ఈడీ దాడులను ఎదుర్కొంటున్న మంత్రి మంత్రి గంగుల కమలాకర్ కు సీబీఐ నుంచి నోటీసులు అందాయి. ఇవాళ ఉదయమే, మంత్రి గంగుల కమలాకర్ కు నోటీసు ఇచ్చింది సిబిఐ. మంత్రి గంగుల కమలాకర్ తో పాటు ఎంపీ గాయత్రి రవికి కూడా నోటీసులు అందాయి.

ఢిల్లీలో అరెస్ట్ అయిన శ్రీనివాస్ వ్యవహారంలో మంత్రి గంగుల కమలాకర్ కు నోటీసు ఇచ్చింది సిబిఐ. మూడు రోజుల క్రితం ఢిల్లీలోని తమిళనాడు భవన్ లో శ్రీనివాసుని అరెస్ట్ చేసిన సిబిఐ… నకిలీ ఐపీఎస్ అధికారి శ్రీనివాస్ ని అరెస్ట్ చేసింది. సీనియర్ ఐపీఎస్ అధికారుల పేర్లు చెప్పి చీటింగ్ పాల్పడుతున్న శ్రీనివాస్ తో మంత్రి గంగుల సంబంధాలు ఉన్నాయనే అనుమానంతో నోటీసులు ఇచ్చినట్లు సమాచారం.