ఆదాయానికి మించి ఆస్తుల కేసులో అరెస్టైన సీసీఎస్ ఏసీపీ ఉపమామహేశ్వర్ రావును ఏసీబీ ప్రత్యేక కోర్టు మూడు రోజుల పోలీసు కస్టడీకి అనుమతించింది. నేటి నుంచి ఆయనను మూడు రోజుల పాటు ఏసీబీ అధికారులు ప్రశ్నించనున్నారు. ప్రస్తుతం చంచల్ గూడ జైలులో రిమాండ్‌లో ఉన్న ఉమామహేశ్వర్ రావును నేడు (మే 29వ తేదీ) ఏసీబీ బృందం తమ కస్టడీలోకి తీసుకోనుంది.
ఆదాయానికి మించి ఆస్తుల వ్యవహారంలో ఆయన నివాసంలో సోదాలు జరిపిన అధికారులకు 37 లక్షల నగదు, 60 తులాల బంగారం లభించిన విషయం తెలిసిందే. దీంతో పాటు స్థిర చరాస్తులను గుర్తించారు. ఆస్తుల విలువ మొత్తం 3.95 కోట్లకు పైగా ఉంటుందని ఏసీబీ అధికారులు అంచనా వేశారు. ఆయనను కస్టడీలోకి తీసుకొని ఆదాయానికి మించి ఆస్తులకు సంబంధించిన విషయాలపై లోతుగా ఏసీబీ అధికారులు లోతుగా ప్రశ్నించనున్నారు. ఈ క్రమంలో ఈరోజు ఉదయం చంచల్గూడకు వెళ్లి ఆయణ్ను అదుపులోకి తీసుకోనున్నారు.