తెలంగాణ నుంచి ధాన్యం సేకరణకు కేంద్రం గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. యాసంగిలో రాష్ట్ర ప్రభుత్వం నుంచి వెళ్లిన అంచనాల మేరకు 80 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యాన్ని కొనుగోలు చేసేందుకు కేంద్రం ఆమోదం తెలిపింది. వచ్చే రబీ సీజన్ లో రాష్ట్రాల నుంచి కొనుగోలు చేయాల్సిన ధాన్యంపై ఆహారం ఆహర మంత్రిత్వశాఖ నిర్వహించిన సమావేశంలో ఈ నిర్ణయం తీసుకున్నారు.
కాగా రాష్ట్ర అధికారుల లెక్కల ప్రకారం 1.28 కోట్ల మెట్రిక్ టన్నుల ధాన్యం దిగుబడి వచ్చే అవకాశం ఉంది. అటు, తెలంగాణలో కోటి ఎకరాల మాగాణి లక్ష్యం నెరవేరిందని సిఎస్ శాంతి కుమారి వెల్లడించారు. రాష్ట్రంలో వానకాలం, యాసంగి కలిపి మొత్తం 1.20 కోట్ల ఎకరాల్లో వరి సాగైనట్లు ఆమె పేర్కొన్నారు. వరి ఉత్పత్తిలో తెలంగాణ దేశంలోనే రెండో స్థానంలో, పత్తి ఉత్పత్తిలో మూడో స్థానంలో ఉందన్నారు. వచ్చే వానకాలం సీజన్ కు అవసరమైన ఎరువులు, విత్తనాలను ముందస్తుగా సిద్ధం చేయాలని అధికారులను ఆమె ఆదేశించారు.