పాకిస్థాన్ ను చూపించి…ప్రధాని మోడీ ఓట్లు అడుగుతున్నాడు -ప్రశాంత్ రెడ్డి

-

పాకిస్థాన్ ను చూపించి…ప్రధాని మోడీ ఓట్లు అడుగుతున్నాడంటూ ప్రధాని మోడీ పై సంచలన వ్యాఖ్యలు చేశారు తెలంగాణ మంత్రి ప్రశాంత్ రెడ్డి. దేశం లో ప్రతి వస్తువు ధర పెరగటానికి ప్రధాన కారణం మోడీ పెంచిన డీజిల్, పెట్రోల్, గ్యాస్ ధరలు అంటూ ఫైర్‌ అయ్యారు.

చైనా రోజు రోజుకి ఇండియా లోపలికి వస్తున్నదని… చైన వైపు కన్నెత్తి చూడటం లేదని మోడీపై విరుచుకుపడ్డారు ప్రశాంత్ రెడ్డి. చిన్న దేశం అయిన పాకిస్థాన్ చూయించి ఓట్లు వేయించుకుంటున్నాడని నిప్పులు చెరిగారు. మత రాజకీయాలు చేస్తూ దేశాన్ని సర్వనాశనం చేస్తున్నాడని మండిపడ్డారు. దేశం రూపాయి విలువ పూర్తిగా దిగజార్చాడు ,మోడీ వచ్చిన మొదట్లో డాలర్ 55 ఉండగా ఇప్పుడు 85 గా మారిందని ప్రధాని మోడీ పై సంచలన వ్యాఖ్యలు చేశారు తెలంగాణ మంత్రి ప్రశాంత్ రెడ్డి.

Read more RELATED
Recommended to you

Latest news