కేంద్ర ఎన్నికల సంఘం సంచలన నిర్ణయం తీసుకున్నది. ఓటర్ ఐడీతో ఆధార్ అనుసంధానానికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. సుప్రీంకోర్టు తీర్పునకు అనుగుణంగా ఆధార్ ఓటర్ కార్డు అనుసంధాన ప్రక్రియను ప్రారంభించబోతున్నట్లు ఎన్నికల కమిషన్ స్పష్టం చేసింది. మంగళవారం పలుశాఖల ముఖ్య కార్యదర్శులతో సీఈసీ సమావేశమైంది. దేశమంతా ఈ ప్రక్రియను ఎన్నికల కమిషన్ అత్యంత వేగంగా జరపాలని నిర్ణయించింది. దీనివల్ల దొంగ ఓట్లను పూర్తిగా నివారించొచ్చని ఈసీ అభిప్రాయపడింది.
ఆధార్ కార్డుతో పాటు ఓటర్ ఐడీ అనుసంధానమయితేనే ఇక నుంచి ఓటింగ్ కి ఇక అనుమతించాలని ఆదేశాలు జారీ చేసింది. సమస్యాత్మక ప్రాంతాలతో పాటు రిగ్గింగ్ వంటివి జరిగే ప్రాంతాల్లో ఇది చాలా ఉపయోగకరంగా ఉండనుందని పేర్కొంది. దీంతో ఈసీ తీసుకున్న ఈ తాజా నిర్ణయం పట్ల సర్వత్రా హర్షం వ్యక్తం చేస్తున్నారు.