తెలుగు రాష్ట్రాల ద్రోహులు జగన్, కేసీఆర్ అని బైరెడ్డి రాజశేఖర్ రెడ్డి పేర్కొన్నారు. తాజాగా ఆయన మీడియాతో పలు ఆసక్తికర విషయాలు మాట్లాడారు. తెలంగాణ రాష్ట్రాన్ని కేసీఆర్ పదేళ్లు దోచుకున్నారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని ఐదేళ్లు దోచుకున్నారు జగన్ మోహన్ రెడ్డి. రెండు రాష్ట్రాలు విడిపోవడం వల్ల దోపిడి చేసి లాభాలు పొందినవారు కేసీఆర్, జగన్ అన్నారు. ప్రత్యేక తెలంగాణ రావడం వల్ల కేసీఆర్, ఆయన కుటుంబమే లాభపడ్డారు.
రాష్ట్రాల ప్రజలను నలిగిపోయే విధంగా చేసిన ద్రోహులు వీళ్లు అని సంచలన వ్యాఖ్యలు చేశారు. తెలుగు రాష్ట్ర ప్రజలను నాశనం చేసి వెళ్లిపోయారు. రాజకీయ నాయకులు దోచుకొని పోతారు. చివరికీ నలిగిపోయేది ఎవరంటే ప్రజలే అని పేర్కొన్నారు. ఎన్టీఆర్ తెలుగుదేశం అని పార్టీ పెట్టారు. తెలంగాణ తెలుగుదేశం, కోస్తా ఆంధ్రా తెలుగుదేశం, రాయలసీమ తెలుగుదేశం అని పెట్టలేదు. తెలుగు జాతి కోసం తెలుగుదేశం అని పెట్టాడని పేర్కొన్నారు. రాష్ట్రంలో కూడా జగన్ చిచ్చు పెట్టాడు. తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డికి అభినందించాలన్నారు. ఏపీలో కూడా మింగలేక, కక్కలేక చంద్రబాబు నాయుడు రాష్ట్రాన్ని దొర్లిస్తున్నాడని ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు బైరెడ్డి రాజశేఖర్ రెడ్డి.