గత ప్రభుత్వం దేవాదుల ప్రాజెక్టును గాలికొదిలేసింది : మంత్రి పొంగులేటి

-

గత ప్రభుత్వం దేవాదుల ప్రాజెక్టును గాలికొదిలేసింది అని  మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి పేర్కొన్నారు. దేవాదుల మూడో ఫేజ్ మోటార్ ప్రారంభోత్సవంలో మంత్రి ఉత్తమ్, మంత్రి పొంగులేటి పాల్గొని ప్రారంభించారు. ఈ సందర్భంగా మంత్రి పొంగులేటి మాట్లాడుతూ 2004లో పెద్ద ఎత్తున ఫేజ్ 1 ఏర్పాటు జరిగింది అని తెలిపారు. ఇందిరమ్మ ప్రభుత్వ హయాంలోనే 2 ఫేజ్ పనులు జరుగాయి. 2006–07 రాజశేఖర్ రెడ్డి హయాంలో, కిరణ్ కుమార్ రెడ్డి పనులు చేపట్టారు.  ప్రస్తుతం సీఎం రేవంత్ రెడ్డి, మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి అధ్యక్షతన దేవాదుల ఫేజ్ –3 పనులు జరుగుతున్నాయి.

దేవాదుల ప్రాజెక్టుని గత ప్రభుత్వం పట్టించుకుంటే పూర్తయ్యేదని తెలిపారు. అనుకున్న ఆయకట్టు కంటే రైతులు ఎక్కువ సాగులోకి వెళ్లడం వల్ల నీరు ఇబ్బంది జరుగుతుందని.. ఎట్టి పరిస్థితిలో మూడో ఫేజ్ కి సంబంధించి పనులు జరుగుతున్నాయి. గత ప్రభుత్వం ఈ ప్రాజెక్టు ను పూర్తిగా గాలికి వదిలేసింది అని తెలిపారు. యుద్ధప్రాతికదిన బడ్జెట్ సమావేశాలున్నప్పటికీ.. రైతన్నల శ్రేయస్సు కోసం సీఎం రేవంత్ రెడ్డి సూచనతో మంత్రులిద్దరం కలిసి మోటార్ ప్రారంభోత్సవానికి వచ్చినట్టు తెలిపారు. ఆనాటి ప్రభుత్వం నిర్లక్ష్యం వల్ల.. కమీషన్లకు కక్కుర్తి పడి ప్రాజెక్టు పనులను చేయలేదు. నిర్లక్ష్యం కారణంగా 6,500 ప్రాజెక్టు 13,500 కోట్లకు వచ్చింది. 13,500 కాస్త 20వేల కోట్ల వరకు పెరిగిందని వెల్లడించారు మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి.

Read more RELATED
Recommended to you

Latest news