బూస్ట‌ర్ టీకా పంపిణీకి కేంద్రాని అనుమ‌తి కోరాం : మంత్రి హరీష్ రావు

తెలంగాణ రాష్ట్రంలో ఫ్రంట్ లైన్ కార్య‌క‌ర్త ల‌కు బూస్ట‌ర్ టీకా పంపిణీ చేయ‌డానికి కేంద్ర ప్ర‌భుత్వాన్ని అనుమ‌తి కోరామ‌ని రాష్ట్ర వైద్య ఆరోగ్య మంత్రి హ‌రీష్ రావు అన్నారు. కరోనా వైర‌స్ తో పాటు ఓమిక్రాన్ వేరియంటు కేసులు భ‌విష్య‌త్తు లో ఎక్కువ వ‌చ్చే అవ‌కాశం ఉంద‌ని నిపుణులు హెచ్చ‌రిచ‌డం తో ఓమిక్రాన్ ప‌ట్ల జాగ్ర‌త్తలు తీసుకుంటున్నామ‌ని అన్నారు. అలాగే అలాగే రాష్ట్ర ప్ర‌జ‌ల‌కు స‌ర్కారు వైద్యాన్ని అందుబాటు లోకి తీసుకురావ‌డం కోసం కృషి చేస్తున్నామ‌ని అన్నారు.

అందులో భాగంగా హైద‌రాబాద్ లో నాలుగు సూప‌ర్ స్పెషాలిటి ఆస్ప‌త్ర‌లను ఏర్పాటు చేయ‌డానికి నిర్ణ‌యం తీసుకున్నామ‌ని వెల్ల‌డించారు. అలాగే హైద‌రాబాద్ లో ఉన్న ఉస్మానియా, నిలోఫ‌ర్, గాంధీ ఆస్ప‌త్రుల‌ను బ‌లోపేతం చేస్తామ‌ని అన్నారు. అలాగే రాష్ట్ర వ్యాప్తంగా గ్రామాల్లో ఉండే ప‌ల్లె దవాఖానా ల‌లో మెరుగైన సౌక‌ర్యాలు క‌ల్పించి అభివృద్ధి చేస్తామ‌ని అన్నారు. ప‌ల్లె ద‌వాఖానాల ద్వారా గ్రామాల్లో వైద్యం అందుతుంద‌ని అన్నారు త‌మ ప్ర‌భుత్వం వైద్య రంగానికి అధిక ప్రాముఖ్య‌త ఇస్తుంద‌ని తెలిపారు.