సెప్టెంబర్‌ 17న హైదరాబాద్‌ లిబరేషన్‌ డే నిర్వహించాలని కేంద్రం నిర్ణయం

-

తెలంగాణ రాష్ట్ర విషయంలో సెప్టెంబర్‌ 17వ తేదీకి సంబంధించి కేంద్ర ప్రభుత్వం తాజాగా కీలక నిర్ణయం తీసుకుంది. ప్రతి ఏడాది సెప్టెంబర్‌ 17వ తేదీన ‘హైదరాబాద్‌ లిబరేషన్‌ డే’ నిర్వహించాలని నిర్ణయించింది. ఈ మేరకు కేంద్ర హోంమంత్రిత్వ శాఖ గెజిట్‌ నోటిఫికేషన్‌ జారీ చేసింది. ఆ రోజు అధికారిక కార్యక్రమాలు నిర్వహించాలని గెజిట్‌లో పేర్కొంది.

భారత్‌ స్వాతంత్య్రం పొందాక హైదరాబాద్‌ సంస్థానం 13 నెలల పాటు నిజాంల పరిపాలనలోనే ఉందని కేంద్రం గెజిట్లో తెలిపింది. 1948 సెప్టెంబర్‌ 17వ తేదీన పోలీస్‌ చర్య ‘ఆపరేషన్‌ పోలో’తో ఈ ప్రాంతం భారత్‌లో విలీనమైందని గుర్తు చేసింది. సెప్టెంబర్‌ 17వ తేదీన ‘హైదరాబాద్‌ విమోచన దినం’ నిర్వహించాలని అక్కడి ప్రజలు డిమాండ్‌ చేస్తున్నారని చెప్పింది. హైదరాబాద్‌కు విముక్తి కల్పించిన అమరవీరులను స్మరించుకోవడానికి, యువతలో దేశభక్తి నింపడానికి సెప్టెంబర్‌ 17న ‘హైదరాబాద్‌ విమోచన దినం’ నిర్వహించాలని కేంద్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకుందని కేంద్ర హోం మంత్రిత్వ శాఖ తాజా గెజిట్ నోటిఫికేషన్‌లో పేర్కొంది.

Read more RELATED
Recommended to you

Latest news