కేఆర్‌ఎంబీ లేకుంటే ఏపీ, తెలంగాణ మధ్య సమన్వయం ఎలా? : జల్‌శక్తి మంత్రి సలహాదారు

-

ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌ విభజన చట్టాన్ని అప్పటి కాంగ్రెస్‌ ప్రభుత్వం సరిగ్గా రూపొందించలేదని కేంద్ర జల్‌శక్తి మంత్రి సలహాదారు శ్రీరాం అన్నారు. ఆరు ప్రాజెక్టులను పూర్తి చేసుకోవాలని విభజన చట్టంలో చెప్పారని, నీటి కేటాయింపులు మాత్రం చెప్పలేదని పేర్కొన్నారు. నాలుగు ఏపీ, రెండు తెలంగాణ ప్రాజెక్టులకు కేటాయింపులు లేవన్న ఆయన.. తెలుగు రాష్ట్రాల మధ్య కృష్ణా జలాల సమస్య పరిష్కారం కోసమే గత అక్టోబర్‌లో కొత్త ట్రైబ్యునల్‌ వేశారని తెలిపారు.

విభజన చట్టం రూపొందించిందే అప్పటి కాంగ్రెస్‌ ప్రభుత్వం. ప్రాజెక్టులను కేంద్రానికి అప్పగించాలని విభజన చట్టం చెబుతోంది. ఇప్పుడు తెలంగాణలోని కాంగ్రెస్‌ ప్రభుత్వమే దాన్ని తప్పు అంటోంది. రాష్ట్రాల మధ్య సమన్వయం కోసమే కేంద్రం ప్రయత్నిస్తోంది. పదేళ్లుగా శ్రీశైలాన్ని ఏపీ, సాగర్‌ను తెలంగాణ నిర్వహిస్తున్నాయి. 299 టీఎంసీలకు గతంలోనే తెలంగాణ అంగీకరించింది. కేఆర్‌ఎంబీని విలన్‌గా చూపించే ప్రయత్నం మంచిది కాదు. ఏపీ, తెలంగాణ పరస్పరం మాట్లాడుకొని పరిష్కరించుకుంటే గొడవే ఉండదు. కేఆర్‌ఎంబీ లేకుంటే ఏపీ, తెలంగాణ మధ్య సమన్వయం ఎలా?’’ అని ప్రశ్నించారు.

Read more RELATED
Recommended to you

Latest news