సైదాబాద్ నిందితుడు రాజు ఆత్మహత్య చేసుకున్న సంగతి తెలిసిందే. ఘట్ కేసర్ వరంగల్ రైల్వే ట్రాక్ పై నిందితుడి మృతదేహం లభించింది. నిందితుడి చేతి పై ఉన్న టాటూ ఆధారంగా పోలీసులు బాడీని గుర్తించారు. అయితే రాజు ఆత్మహత్య చేసుకున్న ఘటన పై చిన్నారి చైత్ర తండ్రి ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు.
రాజు మృతదేహాన్ని సింగరేణి కాలనీ కి తీసుకురావాలని పోలీసుల ముందు డిమాండ్ చేశారు. అది రాజు మృత దేహం కాదో… తాము చెప్తామని… ముందు సింగరేణి కాలనీ కి ఆ మృతదేహాన్ని తీసుకు రావాలని చిన్నారి తండ్రి పేర్కొన్నారు. ఇక అటు రాజు కుటుంబ సభ్యులు.. ఆత్మహత్య ఘటనపై ఆవేదన వ్యక్తం చేశారు. అసలు రాజు ఈ దారుణానికి పాల్పడ్డాడని తాము నమ్మడం లేదన్నారు. తమ ఇంట్లో మృతదేహం దొరకడం కారణంగానే నమ్మాల్సి వస్తోందనీ తెలిపారు. అసలు రాజు చాలా అమాయకూడని కూడా చెబుతున్నారు రాజు కుటుంబ సభ్యులు.