సైదాబాద్ ఘటన మరవకముందే హైదరాబాద్ లో మరో చిన్నారిపై అత్యాచారం జరిగింది. ఈ దారుణం మంఘల్ ఘట్ పీఎస్ పరిధిలో హబీబ్ నగర్ లో చోటు చేసుకుంది. సుమిత్ అనే యువకుడు తొమ్మిదేళ్ళ చిన్నారి పై అత్యాచారానికి యత్నించాడు. బిల్డింగ్ పైకి తీసుకెళ్లి చిన్నారి పై అత్యాచారానికి యత్నించగా చిన్నారి కేకలు వేసింది. దాంతో వెంటనే స్థానికులు అప్రమత్తమయ్యారు. దాంతో నిందితుడు అక్కడ నుండి పరార్ అయ్యాడు.
పోలీసుల ఫిర్యాదు మేరకు నిందితుడిని అత్తాపూర్ పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ఈ ఘటన స్థానికంగా కలకలం రేపింది. ఇక సైదాబాద్ ఘటన రాష్ట్ర వ్యాప్తంగా సంచలనం రేపుతున్న సంగతి తెలిసిందే. అయితే ఆ ఘటన మరవకముందే మళ్ళీ అలాంటి దారుణమే చోటు చేసుకోవడం ఆందోళన కలిగిస్తోంది. ఇక ప్రస్తుతం పోలీసుల అదుపులో ఉన్న నిందితుడికి కఠిన శిక్ష వేయాలని బాధితురాలి తల్లి తండ్రులు డిమాండ్ చేస్తున్నారు.