ముఖ్యమంత్రిగా రేవంత్ రెడ్డి చాలా అభివృద్ధి చేస్తున్నాడు – సీఎం చంద్రబాబు

-

ముఖ్యమంత్రిగా రేవంత్ రెడ్డి చాలా అభివృద్ధి చేస్తున్నాడని కొనియాడారు ఏపీ సీఎం చంద్రబాబు. ఎన్టీఆర్ ట్రస్ట్ భవన్ లో ఏర్పాటు చేసిన సభా వేదిక పైకి చేరుకున్న ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు..అనంతరం మాట్లాడారు. అనేక సంక్షోభాలు ఎదురుకుంది తెలుగు దేశం పార్టీ…నన్ను ఎందుకు జైలుకు పంపారో తెలియదని ఫైర్‌ అయ్యారు. కానీ నా కోసం తెలంగాణలో మీరు నాకోసం చేసిన నిరసనలు మర్చిపోలేనిది..రాజకీయం అంటే సొంత వ్యాపారం చేసుకోవడం కాదని తెలిపారు.

chandrababu on cm revanth

తెలుగు దేశం ముందు.. తెలుగు తరువాత చరిత్రకు చాలా తేడా ఉంది..హైదరాబాద్ లో హై టెక్ సిటి నీ ప్రారంభించిన అభివృద్ధి హైదరాబాద్ దేశంలో నెంబర్ వన్ అయ్యిందన్నారు. నాకు చాలా సంతోషంగా ఉందని… ఔటర్ రింగు రోడ్డు, ఎయిర్ పోర్ట్ దూర దృష్టి తో ప్రతిపాదన చేశానని తెలిపారు. వాటిని ప్రారంభించిన ఘనత తెలుగు దేశం పార్టీదే అన్నారు. మళ్ళీ తెలంగాణలో కాంగ్రెస్ అధికారం లోకి వచ్చింది..రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రిగా చాలా అభివృద్ధి చేస్తున్నాడని తెలిపారు. అందుకే స్వయంగా వచ్చి కలిశాను..రాష్ట్రాలు వేరైనా తెలుగు రాష్ట్రాలు అన్నదమ్ములుగా కొనసాగుతామమని వివరించారు. విడిపోయినా కూడా బయటి వారు వస్తే ఒక్కటవుతామని హెచ్చరించారు.

Read more RELATED
Recommended to you

Latest news