తెలంగాణలో సంపద సృష్టించింది TDP పార్టీ అని చంద్రబాబు అన్నారు. తారకతర్న మరణం బాధాకరమన్న చంద్రబాబు… తెలంగాణలో మెదటి సీటు నాయిబ్రాహ్మణులకు.. రెండో సీటు రజకులకు ఇస్తామని స్పష్టం చేశారు. ఐటీ ఉద్యోగం రావటానికి కారణమైన టీడీపీకి ఐటీ యువత అండగా ఉండాలని… విభజన తర్వాత లేనిపోని సమస్యలు పెట్టుకోవటం సరైంది కాదని వెల్లడించారు.
విభజన తర్వాత కూడా టీడీపీకి తెలంగాణలో 15అసెంబ్లీ స్థానాలొచ్చాయని… కాసాని జ్ఞానేశ్వర్ నాయకత్వంలో తెలంగాణలో టీడీపీ పరుగులు పెడుతోందని వివరించారు. తెలంగాణలో సంపద సృష్టించటానికి కారణం తెలుగుదేశం పార్టీ అని.. పేదలను నాయకులుగా ప్రమేట్ చేసిన పార్టీ తెలుగుదేశం మాత్రమేనని స్పష్టం చేశారు. ప్రజల్లో ఉన్న నాయకులను మాత్రమే పార్టీ గౌరవిస్తోందని.. ఎన్టీఆర్ భవన్ చుట్టూ కాకుండా.. నాయకులు గ్రామాల్లో తిరగాలన్నారు. టీడీపీని కాపాడుకోవటం చారిత్రాత్మక అవసరమని చెప్పారు చంద్రబాబు నాయుడు.