మాజీ సీఎం జగన్‌ పై ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు సెటైర్లు

-

ధరలు పెంచుకుంటూ పోతే.. తాగేవాళ్లు తగ్గుతూ వస్తారు అని  మాజీ సీఎం జగన్‌ అన్న వ్యాఖ్యలపై తాజాగా అసెంబ్లీలో సెటైర్లు వేసారు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు. అసెంబ్లీలో  మద్యం పై శ్వేత పత్రం విడుదల చేశారు. అనంతరం మాట్లాడుతూ.. పాలన ఎలా ఉండకూడదో.. పాలకుడు ఎలా ఉండకూడదో 2019-24 మధ్య జరిగిన పాలన ఒక కేస్ స్టడీగా మిగిలి పోతుందని వివరించారు చంద్రబాబు.

రాష్ట్రంలో మద్యపాన నిషేదం తీసుకొస్తామని హామీ ఇచ్చారు జగన్. క్రమ క్రమేణా మద్యం దుకాణాలు తగ్గించుకుంటూ వస్తామన్నారు. మద్యాన్ని కేవలం ఫైవ్ స్టార్ హోటల్స్ కే పరిమితం చేస్తామన్నారు. రాష్ట్రంలో 4,380 మద్యం షాపులు ఉంటే.. వాటిని 2,934కి తగ్గించారు. వాటిని 3,392 షాపులకు పెంచారు. ఏపీ టూరిజం పేరిట 458 దుకాణాలు కేటాయించారు. 2019లో 840 బార్లుంటే.. ఇప్పటికీ ఆ బార్లు అలాగే ఉన్నాయి. పేరుకే మద్యపాన నిషేధం.. కమిట్ మెంట్ లేదు.. మనసులో మాత్రం వేరే ఉద్దేశాలు పెట్టుకున్నారని పేర్కొన్నారు.

Read more RELATED
Recommended to you

Latest news