కేసీఆర్ సర్కార్ పై త్రిదండి చిన్న జీయర్ స్వామి ప్రశంసలు కురిపించారు. జనగామ జిల్లా పాలకుర్తి మండలం వల్మిడి లో శ్రీ సీతారామచంద్రస్వాముల ఆలయాన్ని ప్రారంభించి విగ్రహాల పునఃప్రతిష్ఠ చేశారు త్రిదండి చిన్న జీయర్ స్వామి. ఈ కార్యక్రమానికి హాజరైన మంత్రులు హరీష్ రావు, ఇంద్రకరణ్ రెడ్డి, ఎర్రబెల్లి దయాకర్ రావు, సత్యవతి రాథోడ్, ఎమ్మెల్సీ కడియం శ్రీహరి, ఎమ్మెల్యే తాటికొండ రాజయ్య పాల్గొన్నారు.
ఈ సందర్భంగా చినజీయర్ స్వామి మాట్లాడుతూ.. ఆనందాన్ని ఇచ్చేది సంపద… కొత్త ఆలయాలు నిర్మించడం సమాజమన్నారు. కానీ పురాతన ఆలయాన్ని పునఃర్జీవం పోయడం గొప్ప విషయం అంటూ కేసీఆర్ సర్కార్ ను పొగిడారు. కోట్లాది రూపాయలు ఖర్చు చేసి వల్మిడి లో రామాలయం నిర్మించడం మహాఅభినందనీయం అన్నారు. దేవుడు గుడి వద్ద అందరు సమానమేనని.. చిన్నా పెద్దా కుల మత భేదం దేవుడి వద్ద ఉండదని చెప్పారు. మానవీయ కోణంతో చేసేపాటు కార్యాలన్ని సత్ఫలితాలు ఇస్తాయన్నారు. అతి ప్రాచీనమైన వాల్మికి తో సంబందం ఉన్న ఆలయం వల్మిడి రామాలయం అంటూ పేర్కొన్నారు త్రిదండి చిన్న జీయర్ స్వామి.