రాష్ట్ర ప్ర‌భుత్వం ఆధ్వ‌ర్యంలో నేడు క్రిస్మ‌స్ విందు

తెలంగాణ రాష్ట్ర ప్ర‌భుత్వం క్రిస్మ‌స్ సంద‌ర్భంగా నేడు క్రిస్మ‌స్ విందును ఇవ్వ‌నుంది. ముఖ్య మంత్రి కేసీఆర్ ఆధ్వ‌ర్యంలో హైద‌రాబాద్ లోని లాల్ బ‌హ‌దూర్ స్టేడియంలో ఈ కార్యక్ర‌మం జ‌ర‌గ‌నుంది. ఈ క్రిస్మ‌స్ విందు కు తెలంగాణ రాష్ట్ర ముఖ్య మంత్రి తో పాటు ప‌లువురు మంత్రులు, కీల‌క నేత‌లు క్రిస్టియ‌న్ మ‌త పెద్ద‌లు హాజ‌రు కానున్నారు. కాగ ప్ర‌తి ఏడాది క్రిస్మ‌స్ సంద‌ర్భంగా రాష్ట్ర ప్ర‌భుత్వం విందు ఏర్పాటు చేస్తుంది.

అందులో భాగం గానే ఈ రోజు క్రిస్మ‌స్ విందును ఏర్పాటు చేస్తున్నారు. కాగ క్రిస్మ‌స్ విందు నేప‌థ్యం లో హైద‌రాబాద్ లో పోలీసులు భారీ బందోబ‌స్తు ఏర్పాటు చేశారు. అంతే కాకుండా లాల్ బ‌హ‌దూర్ స్టేడియం చుట్టు పక్క‌ల ట్రాఫిక్ ఇబ్బందులు రాకుండా పోలీసులు అప్ర‌మ‌త్తం అయ్యారు. అలాగే హైద‌రాబాద్ లో సాయంత్రం 5 గంట‌ల నుంచి రాత్రి 10 గంట‌ల వ‌ర‌కు ప‌లు ప్రాంతాల‌లో ట్రాఫిక్ ఆంక్ష‌లు విధిస్తున్న‌ట్టు పోలీసులు తెలిపారు.