టీఆర్ఎస్ చావు డ‌ప్పు నిర‌స‌న‌పై బండి సంజ‌య్ ఫైర్..!

రాష్ట్ర వ్యాప్తంగా టీఆర్ఎస్ పార్టీ చేప‌ట్టిన చావు డ‌ప్పు నిర‌స‌నల పై తెలంగాణ రాష్ట్ర బీజేపీ అధ్య‌క్షుడు బండి సంజ‌య్ ఫైర్ అయ్యారు. కేసీఆర్ లో సస్కారం లేద‌ని అన్నారు. ముఖ్యమంత్రి స్థానంలో ఉండి చావు డ‌ప్పు కొట్టించ‌డం ఏంట‌ని బండి సంజ‌య్ ప్ర‌శ్నించారు. కేసీఆర్ ఎప్పుడూ ఎదుటివారి చావునే కోరుకుంటారంటూ మండిప‌డ్డారు. నిన్న నిర్వ‌హించిన చావు డ‌ప్పు కార్య‌క్ర‌మానికి డ‌బ్బులిచ్చి మ‌నుషుల‌ను పిలిపించార‌ని అన్నారు. అంతే కాకుండా నిర‌స‌న కార్య‌క్ర‌మంలో టీఆర్ఎస్ నాయ‌కులే డ‌బ్బులిచ్చి మ‌నుషుల‌ను తీసుకువ‌చ్చారంటూ ఆరోపించారు.

టీఆర్ఎస్ చేప‌ట్టిన చావు డ‌ప్పు నిర‌స‌న కార్య‌క్ర‌మంపై బీజేపీ అధిష్టానం సీరియ‌స్ గా ఉంద‌ని అన్నారు. ఇదిలా ఉండ‌గా ఈ నేప‌థ్యంలోనే రాష్ట్రంలోని కీల‌క నేత‌ల‌కు ఢిల్లీ నుండి ఫోన్ వ‌చ్చిన‌ట్టు తెలుస్తోంది. బండి సంజ‌య్, సోయం బాపురావు, కిష‌న్ రెడ్డి, డీకే అరుణ‌, ఎంపీ అర‌వింద్, ఈట‌ల రాజేందర్ స‌హా మ‌రికొంత‌మందికి హోం మంత్రి అమిత్ షా ఫోన్ చేసి ఢిల్లీ రావాలని ఆదేశించిన‌ట్టు తెలుస్తోంది. దాంతో ఈ నాయ‌కులు నేడు అమిత్ షా తో భేటీ కానున్నారు.