తెలంగాణాలో కరోనా వైరస్ వేగంగా విస్తరిస్తుంది. కట్టడి అయిపోయింది అని భావించినా సరే కేసులు మాత్రం ఆగలేదు. రోజు రోజుకి కేసులు పెరుగుతున్నాయి గాని తగ్గడం లేదు. లాక్ డౌన్ లో కఠినం గా ఉన్నా కంటైన్మేంట్ జోన్ ల నుంచి ఎవరిని బయటకు రానీయకుండా జాగ్రత్తలు పడుతున్నా సరే విదేశాల నుంచి వచ్చిన వారి నుంచి అదే విధంగా వలస కూలీల నుంచి కరోనా కేసులు వేగంగా పెరుగుతున్నాయి.
హైదరాబాద్ నగరంలో కరోనా కేసులు వేగంగా విస్తరిస్తున్నాయి. పరిస్థితి హైదరాబాద్ లోనే ఆందోళనకరంగా ఉంది. ఎక్కడిక్కడ కఠిన చర్యలు తీసుకున్నా సరే కేసులు మాత్రం ఆగడం లేదు. ఇక షాద్ నగర్ లో ఒక సంఘటన ప్రభుత్వాన్ని కంగారు పెట్టింది. ఇటీవల షాద్ నగర్ కి చెందిన ఒక వ్యక్తి హైదరాబాద్ లో అంత్యక్రియలకు వెళ్ళాడు. అక్కడ అతనికి కరోనా వైరస్ సోకింది. ఈ విషయం ఆయనకు తెలియదు.
ఆ తర్వాత అతను తిరిగి షాద్ నగర్ వెళ్లి అక్కడ సిగరెట్ తాగాడు. ఆ సిగరెట్ ని మరో ముగ్గురు తో షేర్ చేసుకున్నాడు. దీనితో ఆ ముగ్గురుకి కూడా కరోనా పాజిటివ్ వచ్చింది. ప్రస్తుతం వారి కుటుంబ సభ్యులను కూడా అధికారులు క్వారంటైన్ లో చేర్చారు. ఇక అతను ఎక్కడ సిగరెట్ కొన్నాడు అనేది కూడా ఆరా తీసారు. ఆ సిగరెట్ అమ్మిన వ్యక్తి ఎంత మందికి సిగరెట్లు అమ్మాడు అనేది కూడా ఇప్పుడు అధికారులు ఆరా తీస్తున్నారు.