తెలంగాణలో ప్రతిఏటా మృగశిర కార్తె రోజున ఉబ్బసాన్ని తగ్గించడానికి బత్తిన సోదరులు చేప మందును పంపిణీ చేస్తున్న విషయం తెలిసిందే. అయితే కరోనా కారణంగా గతేడాది ఈ చేపమందు పంపిణీ నిలిచిపోయింది. మరి ఈ ఏడాదైనా పంపిణీ చేస్తారా లేదా అని చాలామంది ఎదురు చూస్తున్నారు. కాగా దీనిపై బత్తిన కుటుంబం క్లారిటీ ఇచ్చింది.
ఈ ఏడాది కూడా చేపమందును పంపిణీ చేయలేమని బత్తిన సోదరులు తెలిపారు. కరోనా నేపథ్యంలో చేప మందును నిలిపి వేశారు. జూన్ 8వ తేదీన చేప మందు పంపిణీ చేయడానికి ఏర్పాట్లు చేశారు. కానీ కరోనా తీవ్రత విపరీతంగా ఉండటంతో మందు పంపిణీ చేయట్లేదని బత్తిని హరినాథ్ గౌడ్ ప్రకటించారు.
ఈ ఏడాది కూడా గతేడాది లాగే చేప మందును తామే ఇంట్లో అందరం తీసుకుంటామని హరినాథ్ గౌడ్ వెల్లడించాడు. కాబట్టి ఈ విషయాన్ని దృష్టిలో ఉంచుకుని ఎవరూ మందుకోసం హైదరాబాద్ రావద్దని కోరారు. ఈ మందుకోసం దేశ, విదేశాల నుంచి లక్షల మంది వచ్చేవారు. గత 173సంవత్సరాలుగా ఈ మందును పంపిణీ చేస్తోంది బత్తిని కుటుంబం.