టీఎస్‌పీఎస్సీ ఛైర్మన్‌ను నియమించిన తెలంగాణ ప్రభుత్వం

-

తెలంగాణ పబ్లిక్‌ సర్వీస్‌ కమిషన్‌ (టీఎస్‌పీఎస్సీ) చైర్మన్‌, సభ్యులను రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ బుధవారం నియమించారు. ముఖ్యమంత్రి ప్రతిపాదనలను గవర్నర్ డా. తమిళిసై సౌందరరాజన్ ఆమోదించారు.చైర్మన్‌గా బి.జనార్ధన్‌రెడ్డిని ప్రభుత్వం నియమించింది. జనార్ధన్‌రెడ్డి ప్రస్తుతం వ్యవసాయశాఖ ముఖ్యకార్యదర్శిగా పనిచేస్తున్నారు.

 

చైర్మన్‌తో పాటు ఏడుగురు సభ్యులను ప్రభుత్వం నియమించింది. రమావత్‌ ధన్‌సింగ్‌, కోట్ల అరుణకుమారి, లింగారెడ్డి, ఆర్‌.సత్యనారాయణ, ఆరవెల్లి చంద్రశేఖర్‌రావు, సుమిత్ర ఆనంద్‌తో పాటు కారం రవీందర్‌రెడ్డిని టీఎస్‌పీఎస్‌సీ సభ్యులుగా ప్రభుత్వం నియమించింది. ఇందుకు సంబంధించిన ఉత్తర్వులను జారీ చేయాల్సిందిగా ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేశ్ కుమార్ ను సీఎం ఆదేశించారు.

కాగా టీఎస్‌పీఎస్సీ ఛైర్మన్‌, సభ్యులను నియమించాలని హైకోర్టు రాష్ట్ర ప్రభుత్వానికి నాలుగు వారాల గడువు విధించింది. ఈ నేపథ్యంలో రాష్ట్ర ప్రభుత్వం నేడు టీఎస్‌పీఎస్సీ చైర్మన్‌, సభ్యులను నియమించింది. ఇక త్వరలో రాష్ట్రంలో ఖాళీగా ఉన్న ఉద్యోగాలను భర్తీ చేయనున్నట్లు ఇప్పటికే ప్రభుత్వం ప్రకటించగా… టీఎస్‌పీఎస్సీ ఛైర్మన్‌, సభ్యులను నియామాకలతో ఈ ప్రక్రియ వేగవంతం అయ్యే అవకాశం ఉంది.

Read more RELATED
Recommended to you

Latest news