BREAKING : చింతమడకలో ఓటేసిన సీఎం కేసీఆర్

-

తెలంగాణ శాసనసభ ఎన్నికల పోలింగ్ ప్రశాంతంగా సాగుతోంది. రాజకీయ ప్రముఖులు, ఎమ్మెల్యే అభ్యర్థులు ఓటు హక్కు వినియోగించుకుంటున్నారు. చాలా మంది ప్రముఖులు తెల్లవారుజాము నుంచే పోలింగ్ కేంద్రాలకు చేరుకుని ఓటు వేశారు. ఇప్పటికే బీఆర్ఎస్ కార్యనిర్వాహక అధ్యక్షుడు, రాష్ట్ర మంత్రి కేటీఆర్ తన సతీమణితో కలిసి.. మరోవైపు ఎమ్మెల్సీ కవిత.. బంజారాహిల్స్​లో తమ ఓటు హక్కు వినియోగించుకున్నారు.

మరోవైపు మెదక్‌ జిల్లా సిద్దిపేట నియోజకవర్గంలో మంత్రి హరీశ్‌ రావు తన సతీమణి, కొడుకుతో కలిసి ఓటు వేశారు. ఇక తాజాగా ముఖ్యమంత్రి కె.చంద్రశేఖరరావు తన ఓటు హక్కును వినియోగించుకున్నారు. సిద్దిపేట మండలం చింతమడకలోని పోలింగ్‌ కేంద్రానికి సతీసమేతంగా వచ్చిన ఆయన తన ఓటును వేసి వెళ్లారు. ఈ సందర్భంగా అక్కడున్న ప్రజలకు అభివాదం చేశారు.

మరోవైపు ప్రజాప్రతినిధులతో పాటు అధికారులు కూడా ఓటు హక్కు వినియోగించుకుంటున్నారు. బంజారాహిల్స్ ఢిల్లీ స్కూల్ ఆఫ్ ఎక్స్‌లైన్స్‌లో కుటుంబ సభ్యులతో కలిసి రాష్ట్ర ఎన్నికల కమిషనర్ సి.పార్థసారథి ఓటుహక్కును వినియోగించుకున్నారు. మరోవైపు ఐపీఎస్‌ అధికారి శిఖా గోయల్‌, ప్రిన్సిపల్ సెక్రెటరీ జయేష్ రంజన్ దంపతులు, కుమార్తెతో కలిసి సమాచార శాఖ కమిషనర్ అశోక్ రెడ్డి ఓటు వేశారు.

Read more RELATED
Recommended to you

Latest news