స్వల్ప ఘటనలు మినహా రాష్ట్రవ్యాప్తంగా ప్రశాంతంగా పోలింగ్‌ : వికాస్‌రాజ్‌

-

తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా పోలింగ్‌ ప్రశాంతంగా కొనసాగుతోందని రాష్ట్ర ఎన్నికల ముఖ్య అధికారి వికాస్‌ రాజ్‌ తెలిపారు. ఆయన పలు పోలింగ్ కేంద్రాలను సందర్శించి ఓటింగ్ సరళిని పర్యవేక్షించారు. ఈ సందర్భంగా మీడియాతో మాట్లాడుతూ.. కొన్నిచోట్ల స్వల్ప ఘటనలు మినహా అంతా ప్రశాంతంగా ఉందని తెలిపారు. పట్టణ ప్రాంతాల్లో మందకొడిగా పోలింగ్‌ మొదలైందని వెల్లడించారు. పట్టణ ప్రాంతాల్లోనూ పోలింగ్‌ పుంజుకుంటుందని భావిస్తున్నట్లు చెప్పారు.

- Advertisement -

“కొన్ని ప్రాంతాల్లో ఈవీఎంలు మార్చాం. వృద్ధులు, దివ్యాంగులు కూడా బాగా వస్తున్నారు. అనారోగ్యంతో ఉన్నా చాలా మంది ఓటింగ్​లో పాల్గొంటున్నారు. ఈసారి ఓటర్లు చాలా ఆసక్తిగా కనిపిస్తున్నారు. గతంలో కంటే ఈసారి పోలింగ్ శాతం పెరుగుతుందని ఆశిస్తున్నా. ఇంకా భాగ్యనగర ఓటర్లంతా బయటకు వచ్చి తమ ఓటు హక్కు వినియోగించుకోవాలి. ఓటరు కార్డే కాదు.. ఆధార్‌, పాన్‌ వంటి గుర్తింపు కార్డులు చూపి ఓటు వేయవచ్చు. ఎమ్మెల్సీ కవితపై ఫిర్యాదు వచ్చింది.. డీఈవోకు నివేదించాం. ఫిర్యాదుపై ఎఫ్‌ఐఆర్‌ కూడా నమోదైంది. మరికొన్ని ఫిర్యాదులు కూడా వచ్చాయి. అన్ని ఫిర్యాదులను డీఈవోలకు పంపాం.. చర్యలు తీసుకుంటాం.” అని సీఈవో వికాస్ రాజ్ తెలిపారు.

Read more RELATED
Recommended to you

Latest news

Must read

జీతం అడిగితే నోటితో చెప్పులు మోయించారు…!

సమాజంలో నేడు పరిస్థితులు ఎలా ఉన్నాయంటే కష్టపడి నెలంతా పనిచేసినా కానీ...

ఢమాల్: కుప్పకూలిన స్టాక్ మార్కెట్లు…అన్ని రంగాలు డౌన్ !

విజయదశమి రోజున ముదుపర్లకు భారీగా నష్టాలు వచ్చినట్లుగా తెలుస్తోంది. ఈ రోజు...