బిఆర్ఎస్ చీఫ్, సీఎం కేసీఆర్ ఎన్నికల పర్యటనలో భాగంగా రెండో విడత రేపటి నుంచి ప్రారంభం కానుంది. ఇప్పటికే పలు నియోజకవర్గాల్లో నిర్వహించిన బహిరంగ సభల్లో పాల్గొన్న సీఎం… రేపు అచ్చంపేట, వనపర్తి, మునుగోడు సభల్లో పాల్గొననున్నారు. ముందుగా నాగర్ కర్నూల్ సభలో పాల్గొంటారని పేర్కొన్న…. తాజాగా వనపర్తికి మార్చారు. ఈనెల 27న మహబూబాబాద్, వర్ధన్నపేట సభల్లో సీఎం పాల్గొననున్నారు.

అయితే 119 నియోజకవర్గాలకు గాను 115 నియోజకవర్గాల్లో అగస్ట్ 15నే బీఆర్ఎస్ అధినేత అభ్యర్థులను ప్రకటించారు. అయితే ఇప్పటికీ నాలుగుచోట్ల ఇంకా ప్రకటించాల్సి ఉంది.తొలుత జనగాం, నర్సాపూర్, గోషామహల్, నాంపల్లి నియోజకవర్గాలకు అభ్యర్థులను ప్రకటించలేదు. అయితే కొన్నిరోజుల క్రితం జనగాంకు పల్లా రాజేశ్వర్ రెడ్డిని ప్రకటించారు. అయితే మల్కాజిగిరికి మైనంపల్లి హన్మంతరావును ప్రకటించినప్పటికీ ఆయన అసంతృప్తితో కాంగ్రెస్ పార్టీలో చేరారు. దీంతో ఈ స్థానం నుంచి మంత్రి మల్లారెడ్డి అల్లుడు మర్రి రాజేశేఖర రెడ్డిని బరిలోకి దింపనున్నారు.