బీసీలకు ముఖ్యమంత్రి పదవీ ఇస్తాం : అమిత్ షా

-

తెలంగాణ బీజేపీ అధికారంలోకి బీసీలకు ముఖ్యమంత్రి పదవీ ఇస్తామని కేంద్ర హోంమంత్రి అమిత్ షా ప్రకటించారు. సూర్యపేట బహిరంగ సభలో అమిత్ షా పలు ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. బడుగు, బలహీన వర్గాల కోసం బీజేపీ పని చేస్తుందని స్పష్టం చేశారు. కాంగ్రెస్, బీఆర్ఎస్ పార్టీలు కుటుంబం సంక్షేమం కోసమే తప్ప ప్రజల కోసం పని చేసే పార్టీలు కాదని ఎద్దేవా చేశారు. రాహుల్ గాంధీని ప్రధాని చేయడమే సోనియాగాంధీ లక్ష్యమని పేర్కొన్నారు. దళితులకు మూడు ఎకరాల భూమి హామీలు ఏమయ్యాయని సీఎం కేసీఆర్ ను ప్రశ్నించారు.

బీసీల సంక్షేమం కోసం కేసీఆర్ ఏం చేశారని ప్రశ్నించారు. బీసీల అభివృద్ధి ప్రధాని నరేంద్ర మోడీ కృషి చేస్తున్నారు. ఎన్నికల ప్రచారంలో వ్యూహాత్మకంగా బీజేపీ బీసీ సీఎంని ప్రకటించింది. తెలంగాణ అభివృద్ధి కోసం మోడీ ప్రభుత్వం పెద్ద ఎత్తున నిధులను అందిస్తోందని తెలిపారు. రైతుల కోసం పసుపు బోర్డు, కృష్ణా నది వివాదాల పరిస్కారం కోసం ట్రైబ్యునల్ ఏర్పాటు చేశామని తెలిపారు. కేసీఆర్ అధికారంలోకి వస్తే దళితుడిని సీఎం చేస్తారా అని ప్రశ్నించారు అమిత్ షా.

Read more RELATED
Recommended to you

Latest news