బీజేపీ నాయకులు హైదరాబాద్ కు వచ్చి తిడుతున్నారు… ఢిల్లీలో అవార్డులు ఇస్తున్నారు – సీఎం కేసీఆర్

-

ముఖ్యమంత్రి కేసీఆర్ నేడు వరంగల్ జిల్లాలో పర్యటిస్తున్నారు. ములుగు రోడ్డులో నూతనంగా నిర్మించిన ప్రతిమ మెడికల్ కాలేజీ హాస్పిటల్, క్యాన్సర్ ఇన్స్టిట్యూట్ ను ఆయన ప్రారంభించారు. ఈ సందర్భంగా సీఎం కేసీఆర్ మాట్లాడుతూ.. బిజెపి నాయకులు హైదరాబాద్ కు వచ్చి తిడుతున్నారు.. ఢిల్లీలో అవార్డులు ఇస్తున్నారని అన్నారు.

భారతదేశంలోనే తెలంగాణ రాష్ట్రం అనేక రంగాలలో నెంబర్ వన్ గా ఉందన్నారు సీఎం. ప్రపంచంలోనే అతిపెద్ద వ్యవసాయ భూములు భారతదేశంలో ఉన్నాయన్నారు. ఇన్ని వనరులు ఉన్నా దేశం వంచింపబడుతుందన్నారు. రాజకీయాల కోసం చేసే విమర్శలను పట్టించుకోవద్దన్నారు. కేంద్రం సహకరించకపోయినా తెలంగాణ రాష్ట్రంలో 33 మెడికల్ కాలేజీలు తెచ్చుకోవచ్చు అన్నారు. సిరిసిల్లలో, ములుగులో పైలట్ ప్రాజెక్టుగా హెల్త్ ప్రొఫైల్ చేస్తున్నామన్నారు.

రాష్ట్రంలోని 119 నియోజకవర్రాష్ట్రంలోని 119 నియోజకవర్గాలలో ఇది అందుబాటులోకి వస్తుందన్నారు. ములుగులో డయాలసిస్ సెంటర్ ని కూడా ప్రారంభిస్తామన్నారు సీఎం కేసీఆర్. వరంగల్ లో మెడికల్ సిటీ నిర్మాణం కూడా జరుగుతుందన్నారు. ఇది పూర్తిగా అయితే హైదరాబాద్ వాళ్ళు కూడా వరంగల్ కి వచ్చి చికిత్స తీసుకునే పరిస్థితి వస్తుందన్నారు. చివరలో జై తెలంగాణ, జై భారత్ నినాదంతో తన ప్రసంగాన్ని ముగించారు సీఎం కేసీఆర్.

Read more RELATED
Recommended to you

Latest news