కొత్త పథకం దిశగా సీఎం కేసీఆర్ కసరత్తు చేస్తున్నట్లు సమాచారం అందుతోంది. తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి రైతులందరికీ పెన్షన్ ఇచ్చేందుకు సిద్ధం అయ్యారట. ఎన్నికల మేనిఫెస్టోపై కసరత్తు చేస్తున్న సీఎం కేసీఆర్… ప్రతిపక్షాల ఊహకు అందని విధంగా పథకాలకు ఫినిషింగ్ టచ్ ఇస్తున్నట్లు తెలుస్తోంది.
తెలంగాణ రాష్ట్రంలో రైతులందరికీ పెన్షన్ అందించే సరికొత్త స్కీమ్ పై అధ్యయనం చేస్తున్నట్లు సమాచారం. ఇదే సమయంలో రైతుబంధు సాయం ఎకరానికి రూ. 6,000, కేసీఆర్ కిట్ పథకం సాయం రూ. 15 వేలకు పెంచాలని….కళ్యాణలక్ష్మి, షాదీ ముబారక్ పథకం కింద ఇస్తున్న మొత్తాన్ని కూడా పెంచాలని కేసీఆర్ భావిస్తున్నారు.
ఇది ఇలా ఉండగా, తెలంగాణ ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర రావు తీవ్ర అనారోగ్యానికి గురైన సంగతి తెలిసిందే. ఈ తరుణంలోనే తెలంగాణ ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర రావు సతీమణి కల్వకుంట్ల శోభ ఇవాళ ఉదయం తిరుమల శ్రీవారిని దర్శించుకోనున్నారు. హైదరాబాదు నుండి ఉదయం రేణిగుంట విమానాశ్రయం చేరుకున్న అనంతరం ఆమె తిరుమల ప్రయాణం అవుతారు.