హాస్టల్స్‌ లో ఉండే విద్యార్థులకు సీఎం కేసీఆర్‌ శుభవార్త..ఇకపై అన్ని ఫ్రీ !

-

హాస్టల్స్‌ లో ఉండే విద్యార్థులకు కేసీఆర్‌ సర్కార్‌ శుభవార్త అందించింది. బిసి పోస్ట్ మెట్రిక్ హాస్టల్స్‌ విద్యార్థులకు కాస్మెటిక్, బెడ్డింగ్ మెటీరియల్, వులన్ బ్లాంకెట్స్, నోట్ బుక్స్ అందజేసే ఉత్తర్వులు జారీ చేసిందని మంత్రి గంగుల కమలాకర్ తెలిపారు. ఎస్సీ, ఎస్టీ, బిసి ప్రీ మెట్రిక్ హాస్టల్ విద్యార్థుల మాదిరే వసతులు కల్పించనున్నారు.


302 హాస్టళ్లలోని 34 వేల మంది విద్యార్థులకు లబ్దీ చేకూరనుందని వివరించారు మంత్రి గంగుల కమలాకర్. సీఎం కేసీఆర్ పాలనలో బిసిల విద్యకు పెద్దపీట వేస్తున్నారని వివరించారు. 327 బిసి గురుకులాలు, 703 హాస్టళ్లు, రాష్ట్ర, జాతీయ, అంతర్జాతీయ స్థాయిలో ఫీజుల చెల్లింపులు చేస్తున్నట్లు వివరించారు మంత్రి గంగుల కమలాకర్. వెనుకబడిన వర్గాల విద్యాప్రధాత సీఎం కేసీఆర్ గారికి ప్రత్యేక కృతజ్ణతలు అని చెప్పారు మంత్రి గంగుల కమలాకర్.

Read more RELATED
Recommended to you

Latest news