తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్ర శేఖర్ రావు.. ఉత్తర తెలంగాణ టూర్ ఫిక్స్ అయింది. రేపు కరీంనగర్ జిల్లాకు సీఎం కేసీఆర్ వెళ్లనున్నారు. రేపు కరీంనగర్ వెళ్లనున్న సీఎం కేసీఆర్.. వేముల వాడ, కొండగట్టు పుణ్య క్షేత్రాల అభివృద్ధి పై సమీక్ష నిర్వహించనున్నారు.
ఈ సమీక్ష సమావేశంలో.. ఉమ్మడి జిల్లాకు చెందిన మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎంపీలు, ఎమ్మెల్సీలు ఇతర నేతలందరూ పాల్గొనున్నారు. వేములవాడ, కొండగట్టు పుణ్య క్షేత్రాలను మరో ఆరు నెలల్లో అభివృద్ధి చేయాలనే లక్ష్యంతో సీఎం కేసీఆర్ ఉన్నట్లు తెలుస్తోంది. ఇందులో భాగంగానే.. రేపు కరీంనగర్ రానున్నారు సీఎం కేసీఆర్. కాగా..ఇవాళ తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ ఢిల్లీకి వెళ్లనున్నారు. హఠాత్తుగా కేసీఆర్ ఢిల్లీకి ఈరోజు బయలుదేర నున్నారు. అయితే ఇది రాజకీయ పర్యటన కాదని తెలుస్తోంది. వైద్యం కోసం కేసీఆర్ ఢిల్లీ వెళ్లనున్నట్లు తెలు స్తోంది. బేగంపేట నుంచి ప్రత్యేక విమానం ద్వారా 12.30 గంటలకు బయలుదేరుతున్నట్లు సమాచారం ఉంది.