BREAKING : పాలమూరుకు రోడ్డు మార్గం ద్వారా బయలుదేరిన సీఎం కేసీఆర్

-

BREAKING : పాలమూరుకు తెలంగాణ రాష్ట్ర సీఎం కేసీఆర్ బయలు దేరారు. పాలమూరు రంగారెడ్డి ఎత్తిపోతల పథకాన్ని ప్రారంభించడానికి ప్రగతి భవన్ నుంచి పాలమూరుకు రోడ్డు మార్గం ద్వారా బయలుదేరారు సీఎం కేసీఆర్. ఇక సీఎం కేసీఆర్‌ కాన్వాయ్‌ వెంబటి.. వందల సంఖ్యలో కార్లు వెలుతున్నాయి. కాగా, మధ్యాహ్నం ఒకటిన్నరకు నాగర్ కర్నూల్ లోని తేజ గార్డెన్స్ కు చేరుకోనున్న సీఎం కేసీఆర్‌..అనంతరం తేజ గార్డెన్లో భోజనం చేయనున్నారు.

CM KCR left for Palamuru by road
CM KCR left for Palamuru by road

ఇక ఇవాళ మధ్యాహ్నం 2:30 కు తేజ గార్డెన్ నుంచి రోడ్డు మార్గాన మూడున్నరకు నార్లాపూర్ కంట్రోల్ రూమ్ కు చేరుకోనున్న కేసీఆర్… అనంతరం కంట్రోల్ రూమ్ లో మోటార్ స్విచ్ ఆన్ చేయనున్నారు. నాలుగు గంటలకు నార్లాపూర్ రిజర్వాయర్ వద్దకు వెళ్లనున్న కేసీఆర్… నాలుగు గంటల 45 నిమిషాలకు కొల్లాపూర్ ఎమ్మెల్యే బీరం హర్షవర్ధన్ రెడ్డి ఇంటికి వెళ్లనున్నారు. ఐదు గంటలకు రోడ్డు మార్గాన సభాస్థలికి చేరుకోనున్న కేసీఆర్… అనంతరం కొల్లాపూర్ లోని పాలమూరు యూనివర్సిటీ గ్రౌండ్స్ లో బహిరంగ సభలో పాల్గొననున్నారు.

Read more RELATED
Recommended to you

Latest news