కాళేశ్వరం ప్రాజెక్టు అప్పు ఎప్పుడో తెగింది – సీఎం కేసీఆర్

-

కాళేశ్వరం ప్రాజెక్టు అప్పు ఎప్పుడో తెగిందని తెలంగాణ సీఎం కేసీఆర్ ప్రకటించారు. కాంగ్రెస్ పార్టీ వీడి కేసీఆర్ సమక్షంలో బీఆర్ఎస్ కండువా కప్పుకున్నారు కుంభం అనిల్ కుమార్ రెడ్డి. ఈ సందర్భంగా సీఎం కేసీఆర్‌ మాట్లాడుతూ…80 వేల కోట్లు పెట్టి కాళేశ్వరం నిర్మిస్తే..దాని బాకీ ఎప్పుడో తీరిపోయిందన్నారు సీఎం కేసీఆర్. దేశంలో ఎక్కడా లేని విధంగా 24 గంటల కరెంట్ ఇస్తున్నామన్నారు.

బీఆర్ఎస్ ఒక టాస్క్ కోసం పుట్టిన పార్టీ అని అన్నారు. తనకంటే ముందు ఎందరో సీఎంలు పనిచేశారు కానీ తాము ఒక టాస్క్ లా పని చేశామన్నారు. పదేండ్ల క్రితం తెలంగాణ గోస వర్ణనాతీతమన్నారు. రాష్ట్రం ఏర్పడక ముందు కరెంట్ లేక పొలాలు ఎండిపోయే పరిస్థితి ఉందన్నారు. ఇప్పుడు రోడ్డుకు ఇరువైపులా ధాన్యపురాశులే కన్పిస్తున్నాయన్నారు. తెలంగాణ రాష్ట్రం ఏర్పడ్డాక ఒక టాస్క్ లా పనిచేశామన్నారు కేసీఆర్. గతంలో ఎంతో మంది సీఎంలు పనిచేశారు కానీ..ఎందుకు కరెంట్ ఇవ్వలేకపోయారని ప్రశ్నించారు.

Read more RELATED
Recommended to you

Exit mobile version