సమాజ్వాది పార్టీ వ్యవస్థాపకులు, ఉత్తరప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి మూలాయం సింగ్ యాదవ్ ఆరోగ్యం విషమించినట్లు తెలుస్తోంది. హర్యానా గురుగ్రామ్ లోని వేదాంత ఆసుపత్రి ఐసీయూలో మూలాయం చికిత్స పొందుతున్నారు. చికిత్సకు ఆయన శరీరం సహకరించడం లేదని, పరిస్థితి మెరుగుపడడం లేదని ఆసుపత్రి వైద్యులు తెలిపారు. మూలయం సింగ్ యాదవ్ యూరిన్ ఇన్ఫెక్షన్, రక్తపోటు సమస్యతో బాధపడుతున్నట్లు వెల్లడించారు.
ములాయం కుటుంబ సభ్యులు ఆసుపత్రికి చేరుకున్నట్లు సమాచారం. ఈ నేపథ్యంలో ములాయం ఆరోగ్య పరిస్థితిపై తెలంగాణ సీఎం కేసీఆర్ ఆరా తీశారు. ములాయం కుమారుడు, మాజీ సీఎం, ఎస్పీ అధ్యక్షుడు అఖిలేష్ యాదవ్ కు మంగళవారం ఫోన్ చేశారు. మూలయం ఆరోగ్య పరిస్థితి ఎలా ఉందో అడిగి తెలుసుకున్నారు. దసరా పండుగ తర్వాత తానే స్వయంగా వచ్చి కలుస్తానని అఖిలేష్ కు సీఎం కేసీఆర్ తెలిపారు.