మహారాష్ట్రలో రైతుల ఆత్మహత్యలు అధికంగా ఉన్నాయన్నారు తెలంగాణ ముఖ్యమంత్రి కే చంద్రశేఖర రావు. నాందేడ్ లో ఏర్పాటు చేసిన బిఆర్ఎస్ బహిరంగ సభలో కెసిఆర్ మాట్లాడుతూ.. ఎన్నో ప్రభుత్వాలు మారాయి, ప్రధానులు మారారు కానీ ఈ దేశ ప్రజల తలరాత మాత్రం మారలేదని అన్నారు. అలాగే స్టేజీపైనే బాల్క సుమన్ ను పొగిడారు సీఎం కేసీఆర్.
“తెలంగాణ ఉద్యమం జరుగుతున్న సమయంలో బాల్క సుమన్ కాలేజీలో విద్యార్థిగా ఉన్నారు. ఉద్యమం సమయంలో మాతో పాటు నడిచాడు. ధైర్యంగా పోరాడారు. అన్నింటటా ముందుండి తెలంగాణ కోసం కోట్లాడాడు. ఆ తర్వాత అతి చిన్న వయసులోనే మొట్టమొదటిసారి ఎంపీగా ఎన్నికయ్యాడు. అతను ఎంపీ అయ్యే సమయానికి 29 ఏళ్లు. బాల్క సుమన్ చాలా చిన్న వ్యక్తి. విద్యార్థి. అలాంటిది ఎంపి ఎలా అయ్యాడు. పోరాడే దమ్ము, ధైర్యం, నిజాయితీ ఉన్న వ్యక్తి కాబట్టే నాయకుడు అయ్యాడు. వేరే నేతలను చూసి భయపడాల్సిన అవసరం లేదు. మనలో నుంచే నాయకులను తయారు చేయాల్సిన అవసరం ఉంది” అంటూ బాల్క సుమన్ ను ఉదాహరణగా చూపుతూ కేసీఆర్ మహారాష్ట్ర ప్రజలకు పిలుపునిచ్చారు.